మిని స్కర్ట్ రాధే మా అభయం: ఏడుగురి ఆత్మహత్య

కచ్: ఆధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా పై మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే వరకట్నం వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న రాధే మా ఇప్పుడు ఒకే కటుంబంలో 7గురు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అయ్యారని ఫిర్యాదు చేశారు.

గుజరాత్ లోని కచ్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం రాధే మా భక్తులు అయ్యారని రమేష్ జోషి అనే ఆయన ఆరోపించారు. తరువాత ఆ కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పిన రాధే మా వారిని లోంగిదీసుకున్నారని అతను ఆరోపించారు.

Another complaint has been filed against self-styled godwoman Radhe Maa

రాధే మా మాటలు నమ్మిన ఆ కుటుంబ సభ్యులు వారి ఆస్తులు మొత్తం ఆమెకు ఇచ్చేశారని, తరువాత ఏవో అద్భుతాలు జరుగుతాయని వారు నమ్మకం పెట్టుకున్నారని రమేష్ జోషి చెప్పాడు. చివరికి వారి పరిస్థితులలో ఎలాంటి మార్పులు రాలేదని అన్నారు.

చివరికి ఆస్తులు పోయి ఉక్కిరిబిక్కిరి అయిన ఆ కుటుంబ సభ్యులు వేరేదారి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకు రాధే మా కారణం అంటు రమేష్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

Another complaint has been filed against self-styled godwoman Radhe Maa

ఇప్పటికే ముంబైకి చెందిన నిక్కీ గుప్తా (32) అనే మహిళ ఆమె అత్తమామల మీద వరకట్నం వేధింపుల కేసు పెట్టారు. రాధే మా ఒత్తడి చెయ్యడం వలనే తనను వేదిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాధే మా ఏడో నిందితురాలు.

మిని స్కర్ట్ లు వేసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చిన రాధే మా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈమె భక్తులు మాత్రం రాధే మా చాల మంచి వ్యక్తి అని పైకి చెబుతున్నారు. అయితే రోజుకొక వివాదంతో రాధే మా నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+