AADHAR: ఆధార్ కార్డు వినియోగదారులకు ఉడాయ్ మరో గుడ్ న్యూస్..!
ఆధార్ కార్డు వినియోగదారులకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్ధ(ఉడాయ్)ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కార్డుల్లో వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న ఉదాయ్ కొంతకాలంగా ఉచితంగానే వాటిని అప్ డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇందుకోసం పలు డెడ్ లైన్ లు విధిస్తున్నా వాటిని అలాగే పొడిగిస్తూ ఉంది. ఇదే క్రమంలో ఆధార్ కార్డుల ఉచిత అప్ డేట్ కు ఇవాళ్టితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించింది.
ఆధార్ కార్డుల్ని ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగిస్తూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుల్లో అడ్రస్ ఎలాంటి ఖర్చులేకుండా ఉచితంగా అప్ డేట్ చేసుకోవాలనుకునేవారికి ఇచ్చిన గడువును ఈ ఏడాది డిసెంబర్ 14 వరకూ పొడిగించింది. ఈ మేరకు ఎక్స్ లో ఉడాయ్ ఓ పోస్టు పెట్టింది. కాబట్టి ఉచితంగా ఆధార్ అడ్రస్, పేరు, పుట్టినతేదీ అప్ డేట్ చేసుకోవాలనుకునే వారు మై ఆధార్ పోర్టల్ లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిశాక మాత్రం ఆధార్ సేవా కేంద్రాల్లో రూ.50 చెల్లించి కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డులో వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకోవాలనుకునే వారు ఉడాయ్ (UIDAI) వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని తిరిగి అందులో ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తాయి. వీటిని చెక్ చేసుకుని అవసరమైన అప్ డేట్ చేసుకుని దానికి తగిన ఆధారాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. దీని ద్వారా అప్ డేట్ ప్రాసెస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.ఇలా చేసుకోలేని వారు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లి రెగ్యులర్ పద్ధతిలో కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.
#UIDAI extends free online document upload facility till 14th December 2024; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/ThB14rWG0h
— Aadhaar (@UIDAI) September 14, 2024












Click it and Unblock the Notifications