Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది, కండీషన్స్ అప్లయ్: మరో కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ పొందేలోపు పలు కీలక తీర్పులు ఇస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందా రాదా అనేదానిపై దాఖలైన పిటిషన్‌పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. సమాచారహక్కు చట్ట పరిధిలోకే (RTI) చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం వస్తుందని వెల్లడించింది. పారదర్శకతను మెయిన్‌టెయిన్ చేయడం వల్ల న్యాయవ్యవస్థకు భంగం వాటిల్లదని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.

ధర్మాసనం ఏం చెప్పింది

ధర్మాసనం ఏం చెప్పింది

దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్‌ను ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థను ధ్వంస చేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసును విచారణ చేసింది చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ దీపక్ గుప్తా మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నాలు సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పు అప్పటి చీఫ్ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రావడం విశేషం. అప్పట్లో సీజేగా ఉన్న కేజీ బాలకృష్ణన్ జడ్జీలకు సంబంధించిన సమాచారం వెల్లడించరాదని అది ఆర్టీఐ పరిధిలోకి రాదని తీర్పు చెప్పారు.మరోవైపు సుప్రీంకోర్టు గోప్యత మరియు గోప్యత హక్కును కొనసాగించాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అదే సమయంలో ఆర్టీఐని నిఘా సాధనంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయమూర్తుల పేర్లను మాత్రమే వెల్లడించవచ్చని చెప్పిన ధర్మాసనం , కారణాలను చెప్పాల్సిన పనిలేదని చెప్పింది.

 కేసు పూర్వాపరాలు

కేసు పూర్వాపరాలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును జనవరి 2010లో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ .నవంబర్ 2007లో ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ జడ్జీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ సుప్రీంకోర్టులో సమాచారచట్టం హక్కు కింద దరఖాస్తు చేశారు. అయితే సమాచారం ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.దీంతో అగర్వాల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ సీఐసీ సర్వోన్నత న్యాయస్థానంను కోరింది. పారదర్శకత చట్టం కింద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా వస్తుందని పేర్కొంది.

 సీఐసీ ఆదేశాలతో ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు

సీఐసీ ఆదేశాలతో ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు

2009 జనవరిలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీజేఐకి జడ్జీల ఆస్తుల వివరాలు తెలపడం సరికాదని అది వారి వ్యక్తిగతం అని పేర్కొంది. అంతేకాదు అతిపారదర్శకత న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 2, 2009న ఏకసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టుకు షాకిస్తూ జడ్జీల ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే అంటూ సీఐసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏకసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ డివిజెన్ బెంచ్‌‌ను ఆశ్రయించింది. ఇక ఇక్కడ కూడా చేదు అనుభవమే ఎదురుకావడంతో హైకోర్టు డివిజన్ బెంచ్‌ తీర్పును సవాలు చేస్తూ రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది.

 కేసు తొలి నుంచి చివరి వరకు...

కేసు తొలి నుంచి చివరి వరకు...

ఆర్టీఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ నవంబర్ 2007లో జడ్జీల ఆస్తులు తెలపాలంటూ సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారు. అయితే సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సీఐసీని ఆశ్రయించారు. సీఐసీ అగర్వాల్‌కు అనుకూలంగా వ్యవహరించింది. సీజేఐ ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని వెల్లడించింది. జనవరి 2009లో సీఐసీపై సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐసీకి అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా త్రిసభ్య ధర్మాసనం సీజేఐ ఆర్టీఐ పరిధిలోకే వస్తుందని తీర్పు చెప్పింది. అక్కడ చుక్కెదురు కావడంతో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది.

మొత్తానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తుంది అని తీర్పు సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వడంతో ఇక అంశానికి తెరపడినట్లయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+