కేరళలో మరో ఎంపాక్స్ కేసు: దేశంలో ఎన్ని కేసులంటే?
Monkeypox: ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (Monkeypox) భారతదేశంలోని కలకలం రేపుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో మరో కేసు వెలుగుచూటంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తెలిపారు.
ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తాజాగా నమోదైన మంకీపాక్స్ కేసుతో కేరళలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండుకు చేరింది. కాగా, భారతదేశంలో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసునమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్2 రకంగా నిర్ధరించారు.

ఆ తర్వాత యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లుగా సెప్టెంబర్ 18న కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా, కేరళ రాష్ట్రంలో మరో వ్యక్తికి ఎంపాక్స్ వ్యాధి సోకింది. దీంతో కేరళలో ఎంపాక్స్ కేసులు రెండుకు చేరుకోగా.. దేశంలో ఈ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఎంపాక్స్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
కాగా, ఇప్పటి వరకు 122 దేశాల్లో 99,518 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. కరోనా తర్వాత ఎంపాక్స్ మరోసారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా వ్యాపిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం గమనార్హం. ఆఫ్రికా దేశాల్లో వేలల్లో ఎంపాక్స్ కేసులు నమోదు కాగా, వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
మంకీపాక్స్ లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు వస్తాయి. శరీరంపై పలు చోట్ల పొక్కులు రావడంతోపాటు నీటి బొడపెలుగా మొదలై ఎరుపు, నలుపు రంగులోకి అవి మారిపోతాయి. వ్యాధి బారినపడిన వ్యక్తికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications