కాబోయే అల్లుడితో మరో అత్త జంప్.. మళ్లీ యూపీ లోనే !

ఓ పక్క పెళ్లి కానీ వాళ్లు అంతా పెళ్లి కోసం పోరాటాలు చేస్తుంటే.. మరోవైపు పెళ్లి అయిన వారు మాత్రం పెళ్లి చేసుకోవద్దు అంటూ హితబోధ చేస్తున్నారు. ఇవన్నీ చాలవు అన్నట్టు ప్రేమించిన అబ్బాయి కోసం కట్టుకున్న భర్తను హత్య చేసి అతనితో లేచిపోతున్న వారు ఒక వర్గం అయితే.. పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను మట్టుబెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా మరో ట్రెండ్ నడుస్తోంది.

పెళ్లి కోసం వెళ్లిన ఒక అబ్బాయి.. అమ్మాయితో మొదటి చూపులోనే ప్రేమలో పడడం సాధారణం. కానీ కాబోయే పెళ్లి కూతురు సోదరీమణులతోనే, స్నేహితులతోనే, ఇతర బంధువులతోనే ప్రేమలో పడితే అది అసాధారణం. కానీ ఏకంగా కాబోయే భార్య తల్లితో ప్రేమలో పడితే.. ఎలా ఉంటుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ప్రస్తుతం ఇదే జరుగుతోంది. కాబోయే అల్లుడితో అత్త జంప్ అవ్వడం. అది కూడా ఒకే రాష్ట్రంలో వరుసగా ఇది రెండో ఘటన కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

another-mother-in-law-jumps-with-her-future-son-in-law-again-in-up

కుమార్తె పెళ్లి అంటే అన్ని తానై చూసుకునే ఆమె తల్లి.. ఏకంగా కాబోయే వరుడితో జంప్ అయ్యింది. కాబోయే అల్లుడితో లేచిపోవడమే కాకుండా ఇంట్లోని రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన బంగారు నగలను సైతం పట్టుకుపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడు మళ్లీ యూపీ లోనే ఇదే తరహా ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా ఖొడారే గ్రామానికి చెందిన యువతికి.. బస్తీ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఇద్దరికీ ఒకరినొకరు నచ్చడంతో, కుటుంబాల మధ్య మాటా ముచ్చట్లు జరిగి, మే 9వ తేదీన వివాహం జరపాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే, నిశ్చయమైన నాటి నుంచి యువకుడు తరచూ అమ్మాయి ఇంటికి ఫోన్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే - అతడు ఎక్కువగా కాబోయే భార్యతో కాకుండా, ఆమె తల్లితోనే మాట్లాడేవాడు.

మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోని కుటుంబ సభ్యులు, కాలక్రమేణా వారిద్దరి మధ్య సంబంధంపై అనుమానంతో నిమగ్నమయ్యారు. అమ్మాయి తండ్రి కొంతమంది ద్వారా విచారించగా, తన కూతురికి నిశ్చయమైన అబ్బాయి, తన భార్య ప్రేమలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయం తెలిసిన కూతురు తీవ్ర ఆవేదనతో తన పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరింది. ఆమె తెలిపిన కారణాలు విని, తండ్రి వెంటనే పెళ్లిని రద్దు చేసి, భార్యను గట్టిగా హెచ్చరించాడు. అనంతరం, మరో మంచి సంబంధం చూసి కూతురికి కొత్తగా పెళ్లి నిశ్చయం చేశారు. కానీ అంతలోనే తల్లి మాత్రం మొదటి అబ్బాయితో సంప్రదింపులు కొనసాగిస్తూ, ఫోన్‌లో మాట్లాడటం, కలవడం వంటి వ్యవహారాలు కొనసాగించింది.

ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే తాము కలిసి జీవించలేమని భావించిన వీరిద్దరూ - కుటుంబాలకు తెలియకుండా ఒకరోజు పారిపోయారు. ఇరు కుటుంబాలు గాలింపు చర్యలు చేపట్టగా, యువకుడి ఇంటికి కాల్ చేసిన అమ్మాయి తండ్రి, అతడు ఇంట్లో లేడని విన్న వెంటనే, తన అనుమానం నిజమని గుర్తించాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా ఇటువంటి ఘటనలు జరగడం హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+