Adani Group : అదానీకి సుప్రీంకోర్టు మరో షాక్ - మీడియా వార్తల్ని అడ్డుకోలేం..!
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ పై మీడియాలో వస్తున్న కథనాల్ని అడ్డుకోవాలన్న వినతిని సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది.
అదానీ గ్రూప్ అక్రమాలను హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో దీనిపై దేశవ్యాప్తంగా మీడియాలో వేల సంఖ్యలో కథనాలు వస్తున్నాయి. వీటిలో చాలా వరకూ పరిశోధనాత్మక కథనాలు కాగా.. మరికొన్ని రోజువారీ అఫ్ డేట్స్ తో సాధారణ వార్తలు కూడా ఉంటున్నాయి. అయితే ఈ సమస్యపై కోర్టు తీర్పు ఇచ్చే వరకు మీడియాను రిపోర్టింగ్ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ అదానీ గ్రూప్ తరఫున దాఖలైన పిల్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. మీడియాను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. హిండెన్‌బర్గ్ అధ్యయనంపై దర్యాప్తు కోరుతూ సీనియర్ న్యాయవాది ఎల్ శర్మ పిల్ దాఖలు చేశారు. మీడియా సంచలనాల కోసం ప్రయత్నిస్తోందని, కాబట్టి ఈ కథనాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

అలాగే త్వరలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతోందని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కాబట్టి ఈ తరుణంలో మీడియా వార్తలపై నిషేధం విధించలేమన్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు చేసేందుకు కేంద్రం నియమించిన కమిటీపై అభ్యంతరాలు వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు.. తామే సభ్యుల్ని నియమిస్తామని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications