నెలకు రూ.లక్ష: హైప్రొఫైల్ సెక్స్ రాకెట్ రట్టు, ముగ్గురు యువతులు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని విశాల్ ఖాంద్ -3లో పోలీసులు సోమవారం రాత్రి, మంగళవారం సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నలుగురు పురుషులను, ముగ్గురు వ్యభిచారిణులను కలిపి మొత్తం పదకొండు మందిని అరెస్టు చేశారు. వ్యభిచారం నడుపుతున్న ఇల్లు ఓ సీనియర్ అధికారికి చెందినదిగా గుర్తించారని తెలుస్తోంది.
ఈ నివాసానికి నెలకు రూ.లక్ష కిరాయి ఇస్తూ ఇందులో అతనికి తెలియకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సెక్స్ రాకెట్ సూత్రదారి మహేంద్ర పాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని కారును, భవంతిని స్వాధీనం చేసుకున్నారు. గోమతి నగర్, ఘాజీపూర్ పోలీసుల అధికారులు ఉమ్మడిగా ఈ రాకెట్‌ను రట్టు చేశారు.

ఆన్ లైన్ ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసుల స్టింగ్ ఆపరేషన్లో తెలిసింది. 3,227 స్కైర్ ఫీట్లు ఉన్న ఆ ఇంటిలో సూత్రధారి అన్ని వసతులు సమకూర్చాడు. ఆ గదిలో ఎల్సీడీ టీవీలు, మంచి ఎయిర్ కండిషన్ తదితరాలు ఉన్నాయి.
పట్టుబడ్డ ముగ్గురు కాల్ గర్ల్స్ ఎన్సీఆర్‌కు చెందిన వారు. అందులో ఇద్దరు ఇరవయ్యేళ్ల వయస్సు వారే ఉన్నారు. కస్టమర్లకు వెబ్ సైట్ ద్వారా అమ్మాయిల వివరాలు ఇస్తుంటారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటికి రూ.లక్ష ఇస్తున్నారు. అయితే, ఆ ప్రాంతంలో అంత పెద్ద మొత్తంలో రెంట్ లేదని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications