కావేరి చిచ్చు: చెన్నైలో నిప్పంటించుకున్న యువకుడు
చెన్నై: కావేరీ జలాల పంపిణి విషయంలో కర్ణాటక-తమిళనాడు ప్రజల మధ్య విభేదాలు ముదిరిపోతున్నాయి. కావేరీ నీటి విషయంలో కర్ణాటక రాద్దాంతం చేస్తున్నది ఆరోపిస్తు నామ్ తమిళర్ పార్టీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
తమిళనాడులోని తంజావూర్ సమీపంలోని మణ్ణార్ గుడిలో నివాసం ఉంటున్న విఘ్నేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు సిమాన్ స్థాపించిన నామ్ తమిళర్ కట్చి పార్టీ కార్యకర్తలు కర్ణాటకలో తమిళ ప్రజల మీద దాడులు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై నగరంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో విఘ్నేష్ పాల్గొన్నాడు. అదే సమయంలో విఘ్నేష్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, మీరు వచ్చి ఆ దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే మీ టీఆర్ పీ రేటింగ్ పెరుగుతుందని టీవీ చానళ్లకు ఫేస్ బుక్ ద్వారా సమాచారం ఇచ్చాడు.
అతని స్నేహితులకు ఫేస్ బుక్ ద్వారానే ఈ సమాచారం ఇచ్చాడు. అయితే వారు కావాలనే ఇలా పంపించాడని పట్టించుకోలేదు. చివరికి ధర్నా జరుగుతున్న చోట విఘ్నేష్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

సాటి కార్యకర్తలు అతి కష్టం మీద మంటలు అదుపుచేశారు. విఘ్నేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications