ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి..?
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా.. కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇతను మన జాతీయగీతం రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అని. అలా అనుకుంటే మీరంతా పప్పులో కాలేసినట్టే. ఈ ఫోటోలో ఉన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు.. మన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యారా.. కాస్త దగ్గరగా చూడండి మీకే తెలుస్తుంది.
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించారు, నటిస్తున్నారు కూడా. తాజాగా తన 538వ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇన్స్‌టాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోతో పాటు అప్‌డేట్ కూడా ఇచ్చారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నట్లు ఇన్స్‌టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చూసినవారెవరూ అనుపమ్ ఖేర్ అని కచ్చితంగా గుర్తించరు. అందులో ఉన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ అనే అనుకుంటారు.

ఇక ఇన్స్‌టాలో వీడియో పోస్టు చేసిన అనుపమ్ ఖేర్ త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడిస్తానంటూ రాసుకొచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప వ్యక్తి పాత్రను బిగ్‌స్క్రీన్‌పై పోషిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఈ అరుదైన అవకాశం తనకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ రాసుకొచ్చారు. ఆ వీడియోలో ఉన్నది అనుపమ్ ఖేర్ అని అసలు గుర్తించలేకపోయామంటూ ఒకరు పోస్టు చేయగా... మరో నెటిజెన్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నామంటూ పోస్టు చేశారు. మరొకరు ఈ ప్రాజెక్ట్ చేయడం నీ కెరీర్‌లోనే ఓ కీలక మలుపులాంటిదని , గురుదేవ్ దీవెనలు మీకుంటాయని పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications