అక్రమార్కులకు దడ: లేడీ డీఎస్ పీ రాజీనామా

బళ్లారి: అక్రమార్కుల గుండెల్లో దడపుట్టిస్తూ నీతి నిజాయితీ పోలీసు అధికారిణి అని పేరు తెచ్చుకున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా, కూడ్లిగి సబ్ డివిజన్ డీఎస్ పీ అనుపమ షణై రాజీనామ ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తలనొప్పిగా మారింది. డీఎస్ పీ అనుపమ రాజీనామా గురించి మాట్లాడటానికి అందరూ జంకుతున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ సైతం అనుపమ రాజీనామా విషయంలో నొరు మెదపడం లేదు. ఇదే సమయంలో డీఎస్ పీ అనుపమ ఫేస్ బుక్ లో ఓ సారాంశం పోస్టు చేశారు. గొప్పమాటలు చెప్పే వారంతా పెద్ద వారు కాలేరు, చిన్న చిన్న మాటలను అర్థం చేసుకున్న వారే మహానుభావులు అంటూ పోస్టు చేశారు.

Anupama Shenoy, Deputy Superintendent of Police, Kudligi Sub-division in Ballari district,

అనుపమ రాజీనామాపై బళ్లారి జిల్లాలో పలువురు ఆందోళనకు దిగుతున్నారు. అనుపమ సిన్సియర్ అధికారిణి. ఆమె రాజీనామాను అంగీకరించరాదని ధర్నాలు చేస్తున్నారు. అనుపమ రాజీనామా పత్రం ఆదివారం పోలీసు శాఖ అధికారుల చేతికి అందింది. అయితే ఆమె రాజీనామాను అంగీకరిస్తారా ? సర్ధి చెబుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కూడ్లిగిలో అంబేద్కర్ కట్టడ నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. ఈ సందర్బంలో ఇరు పార్టీలకు చెదిన వారిని అనుపమ అరెస్టు చేశారు. ఈ విషయంలో పై అధికారుల ఒత్తిడి చెయ్యడం వలనే అనుపమ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని తెలిసింది.

అయితే ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు మాత్రం తెలియడం లేదు. అనుపమ మొబైల్ ఫోన్ లో మీడియాతో మాట్లాడటానికి అందుబాటులో లేరు. ఆమె ఉడిపి వెళ్లారని తెలిసింది. ప్రతిపక్షాలు ఆందోళన చెయ్యకముందే అనుపమకు నచ్చ చెప్పి రాజీనామ లేఖను వెనక్కి తీసుకునేలా చెయ్యాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+