ప్లేబాయ్‌కి అనుష్క లక్కీచార్మ్!: లవ్, క్రికెట్.. అన్నింటా కోహ్లీ దూకుడే
న్యూఢిల్లీ: క్రికెట్లో దూకుడు, అనుష్క శర్మతో ప్రేమాయణం, ధోనీ నుండి అకస్మాత్తుగా సారథ్యం, గర్ల్ ఫ్రెండ్‌ను సిరీస్‌లకు తీసుకు వెళ్లడం.. ఇలా విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పైన జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసి కోహ్లీ తన ప్రత్యేకతను మళ్లీ చాటుకున్నాడు.
కోహ్లీలో ఎన్నో కోణాలు ఉన్నాయి. కోహ్లీ చూపులు ప్రత్యర్థి జట్టు సభ్యులను కొరకొరా చూస్తున్నట్టుగా ఉంటాయి. అండర్-19లోనే కోహ్లీ అదరగొట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్‌ను ఇండియా కొట్టేసింది. రాహుల్ ద్రావిడ్‌లోని పట్టుదల, వీరేంద్ర సెహ్వాగ్‌లోని కసి, సచిన్‌లోని అసాధారణ శైలి.. ఈ త్రిమూర్తుల్లోని మూడు లక్షణాలు కలిస్తే విరాట్ కోహ్లీ అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అక్షరాలా పొగిడాడు.

కపిల్ దేవ్‌లోని స్పిరిట్ కూడా కోహ్లీలో ఉందంటారు. కోహ్లీ రికార్డులు, ఆట గురించి ప్రత్యేకంగా చెప్పుకోడానికి చాలానే ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సమయంలో వారికి ధీటుగా దూకుడు ప్రదర్శించి చర్చకు దారి తీశాడు.
ఇక, కోహ్లీ ప్రేమలోను ప్రత్యేకమే. నేను అనుష్కా శర్మ ప్రేమించుకుంటున్నామని పబ్లిక్‌గా చెప్పేశాడు. ఇప్పడు ఈ జంట చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. కోహ్లీ సెంచరీలు బాదిన ప్రతిసారీ పిచ్‌పై నుంచే బ్యాటు మీదుగా అనుష్కకు ముద్దులు విసురుతున్నాడు. భారత ఆటగాళ్లెవరైనా ఇప్పటిదాకా అంత సాహసం చేయలేదనే చెప్పొచ్చు. కాగా, బాలీవుడ్ భామ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ లక్కీ చార్మ్ అని చెవులు కూడా కొరుక్కుంటున్నారు!
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications