తండ్రయిన విరాట్ కోహ్లీ: బిడ్డకు జన్మనిచ్చిన అనూష్క శర్మ: వైసీపీ ఎంపీ శుభాకాంక్షలు

ముంబై: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ కొద్దిసేపటి కిందటే ప్రసవించారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అనూష్క శర్మ కాన్పు అయ్యారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ వెల్లడించారు. దీనిపై ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటిదాకా ఇద్దరుగా ఉన్న తాము ఇక ముగ్గురు అయ్యామని పేర్కొన్నారు. తమ ఇంట్లోకి కొత్తగా ఆడపిల్ల ప్రవేశించినట్లు తెలిపారు. అనూస్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని విరాట్ కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ.. విరూష్క జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా తల్లిదండ్రులయిన విరాట్ కోహ్లీ, అనూష్క శర్మలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ విడుదల చేసిన ప్రకటనను ఆయన రీట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ తన జీవితంలో తండ్రిగా కొత్త ఇన్నింగ్‌ను ప్రారంభించారని పరిమళ్ నత్వానీ పేర్కొన్నారు. తొలి కాన్పులో ఆడపిల్లకు జన్మనివ్వడం శుభసూచకమని, విరూష్క జంటకు అన్నీ శుభాలే కలగాలని అకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Anushka Sharma gives birth to baby girl, YSRCP MP Nathwani wishes Virushka couple

తాను గర్భం దాల్చాననే విషయాన్ని అనూష్క శర్మ గత ఏడాది ఆగస్టులో వెల్లడించిన విషయం తెలిసిందే. జనవరిలో తమ ఇంట్లోకి కొత్త సభ్యుడు రాబోతోన్నాడంటూ అప్పట్లో ఆమె వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్,, మూడు టీ20ల సిరీస్ ఇప్పటికే ముగిసింది. నాలుగు టెస్ట్ మ్యాచుల్లో రెండు పూర్తయ్యాయి. మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. తొలి టెస్ట్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యాడు. అనూష్క శర్మ ప్రసవ సమయం దగ్గర పడటం వల్లే అతను జట్టును వీడాల్సి వచ్చింది. కాన్పు సమయంలో భార్య వద్ద గడపడానికి అతను భారత్‌కు వచ్చాడు.

Anushka Sharma gives birth to baby girl, YSRCP MP Nathwani wishes Virushka couple
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+