మేగజైన్‌పై అనుష్క శర్మ హాట్ ఫోటో: కోహ్లీ అప్‌సెట్, ఫోన్లో నిలదీత!

న్యూఢిల్లీ: భారత జట్టు క్రికెటర్ విరాట్ కోహ్లీని తన ప్రేయసి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అప్ సెట్ చేసిందట! ఆమె వ్యవహార శైలి పైన కోహ్ల అసహనానికి గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అనుష్క ఓ మేగజైన్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ అతని అసహనానికి కారణమంటున్నారు.

స్కిన్ షోలో భాగంగా మేగజైన్‌లో అనుష్క హాట్‌గా కనిపించింది. దీంతో అసంతృప్తికి లోనైన విరాట్ కోహ్లీ దీని పైన అనుష్కను నిలదీశాడంటున్నారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని అతను ఫోన్లో అడిగాడట. పురుష మేగజైన్‌కు ఆమె ఫోటోషూట్ ఇచ్చింది. ఇది డిసెంబరు నెల ముఖ చిత్రం. కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Anushka Sharma upsets Virat Kohli?

కాగా, బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ, భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రేమాయణానికి సంబంధించిన ఊహాగానాలకు నెల రోజుల క్రితం తెరపడిన విషయం తెలిసిందే. పుకార్లకు తెర దించుతూ అవును మేమిద్దరం ప్రేమించకుంటున్నామని, డేటింగ్ చేస్తున్నామని విరాట్ కోహ్లీ కుండ బద్దలు కొట్టాడు.

తామిద్దరి మధ్య అనుబంధం వాస్తవమేనని అంగీకరించాడు. అయితే కనీస ఇంగితం ప్రదర్శించాలని తన బంధంపై పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్న వారిని కోరాడు. ‘మేం ఏ విషయాన్నీ దాచిపెట్టడంలేదు. దాచాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఇప్పుడంతా బహిరంగమే.

కానీ, అదే విషయాన్ని మీరు పదే పదే అడగడం సరికాదు. ఇద్దరం కలిసి ఎక్కడ కనిపించినా ‘ఇది నిజమేనా.. ఖరారైనట్టేనా' అంటూ ఏవేవో అడుగుతున్నారు. కనీస ఇంగితం ప్రదర్శించండి. మీ అందరికీ తెలుసు. కానీ ఎందుకు పదే పదే అడుగుతుంటార'ని కోహ్లీ అన్నాడు. తమ మానాన తమను వదిలిపెట్టాలని, తమకు ప్రైవసీ కావాలని అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+