అనుష్క శర్మ బిజీ, ఐనా విరాట్ కోహ్లీ కోసం టైమిస్తోంది!
హైదరాబాద్: బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం కేటాయించిందట! కోహ్లీ తాజాగా ఓ యాడ్‌లో నటిస్తున్నాడు. అందులో అనుష్క శర్మ నటించడం లేదు. అయినప్పటికీ, ఈ యాడ్‌లో కోహ్లీ బాగా కనిపించాలని తాపత్రయపడుతోందట!
కోహ్లీ బాగా కనిపించాలని అనుష్క విరాట్ కోహ్లీ, అతని హెయిర్ అండ్ మేకప్ టీమ్‌ను కలిసి సూచనలు ఇస్తోందని సమాచారం. అతను ఫర్‌ఫెక్ట్ లుక్ కోసం ఆమె వారితో డిస్కస్ చేశారని అంటున్నారు. ఈ యాడ్ షూటింగుకు కొద్ది రోజుల క్రితం కోహ్లీ, అనుష్కలు ఓ సెలూన్‌కు వెళ్లారని, అక్కడ కోహ్లీ హెయిర్ కటింగ్ చేయించుకున్నారని అంటున్నారు.

కాగా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఏదో ఉందనే ప్రచారం చాలా రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో అనుష్క శర్మ ఓ సినిమా షూటింగులో ఇరవై టేకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆరు నెలల క్రితం ట్వంటీ 20 ప్రపంచ కప్ పర్యటన ముగించుకొని వచ్చిన కోహ్లీ భారత్‌లో అడుగు పెట్టగానే అనుష్క కోసం వెళ్లాడు. ఓ సినిమా షూటింగు కోసం అనుష్క శర్మ రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్లారు. ఇది తెలిసిన విరాట్ అక్కడకు వెళ్లారు. కోహ్లీ వచ్చిన సమయంలో అనుష్క శర్మ సినిమా సెట్ పైన ఉంది. కోహ్లీని చూసిన అనుష్క శర్మ... అప్పుడు ఒక్క సీన్ కోసం ఇరవై టేకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications