చెన్నైలో కూలిన భవనం: చిరు, చంద్రబాబు పరామర్శ
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో కూలిన భవనం సంఘటనా స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారంనాడు సందర్శించారు. వారు బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల్లో వేగం పెంచడానికి మరింత మంది జాతీయ ప్రకృతి విపత్తుల రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని, నిపుణులను పంపించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సహాయక చర్యలను ముమ్మరం చేస్తే మరింత మందిని రక్షించే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. శిథిలాల తొలగింపునకు ఐదారు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారని, అయితే సహాయక చర్యలను వేగవంతం చేస్తే మరింత మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

మృతుల కటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, గాయపడినవారికి 50 వేల రూపాయలేసి నష్టపరిహారాన్ని చంద్రబాబు ప్రకటిచారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో 23 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఆంధ్రప్రదేశ్ అధికారులు చెబుతున్నారు.
శనివారంనాడు చెన్నైలో కూలిన భవనం కింద 70 మంది చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రకు చెందిన కూలీలున్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీశారు. 22 మందిని రక్షించారు.
-
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications