ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా, ఏపీకి కొత్తది: వెంకయ్య
న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మారుస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం తెలిపారు. అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఏపీ ఎక్స్‌ప్రెస్ ఇస్తామని చెప్పారు. ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని తెలంగాణ నేతలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్య ప్రకటన వచ్చింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ - హైదరాబాదుల మధ్య నడుస్తోంది.
రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన మాట్లాడుతూ.. సంప్రదాయాలకు విరుద్ధంగా రైల్వే బడ్జెట్ ఉందని కితాబిచ్చారు. పొగడ్తల కోసం కాదని, ప్రజల కోసం పని చేయమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. భారతీయ కంపెనీల్లో పట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని వెంకయ్య తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య, జపాన్ పరిశ్రమల సమాఖ్య చర్చించుకుని అవసరమైన సూచనలు చేస్తే కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. జపాన్‌లో పర్యటించాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని తెలిపారు.
రైల్వే బడ్జెట్ పైన ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. రైల్వే బడ్జెట్ కేవలం ప్రచారానికే పరిమితమైందని, సామాన్యులకు నిరుపయోగంగా ఉందని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చకుంటే ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదవిలో ఉండటం అనవసరమన్నారు.

రైల్వేలను ప్రైవేటీకరించం: సురేశ్ ప్రభు
రైల్వేలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రైల్లే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తేల్చి చెప్పారు. భారతీయ రైల్వేలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రయాణికుల టికెట్ చార్జీలను పెంచడం.. పన్ను చెల్లింపుదారుల డబ్బులు తీసుకెళ్లి రైల్వే అభివృద్ధికి ఖర్చు చేయడం వంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని, ఇకనుంచి రైల్వేలు దీర్ఘకాలిక అప్పులపైనే ఆధారపడాలన్నారు. గురువారం లోకసభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయన లోకసభ టీవీతో మాట్లాడారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications