ఏపీ గ్రామ సచివాలయంలో భారీ స్థాయిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది భారీగా చేపట్టిన గ్రామ సెక్రటేరియట్ పోస్టల భర్తీ తర్వాత మళ్లీ భారీ సంఖ్యలో అదే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామ సెక్రటేరియట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ, వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ పోస్టులతో పాటు మరిన్ని పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ జనవరి 31 2020.
సంస్థ పేరు: ఏపీ గ్రామ సచివాలయం
పోస్టు పేరు: వివిధ రకాల ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 15971
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2020
విద్యార్హతలు: 10వ తరగతి, 12వ తరగతి డిప్లొమా, డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష

అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులందరికీ రూ.200/- అప్లికేషన్ ఫీజు. నాన్ లోకల్ అభ్యర్థులకు రూ. 100 అదనం
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2020












Click it and Unblock the Notifications