Weather update: మరో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో రానున్న 3రోజులు భారీ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొద్ది రోజులుగా కొనసాగనున్నాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు సహా పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యే నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సెప్టెంబర్ 11న ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది తదుపరి 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

 AP TS Weather: Three more days heavy rains in andhra pradesh and telangana states.

గురువారం, శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శనివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురు, శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులపై నుంచి వరద పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

మరో అల్పపీడనం... తెలంగాణలోనూ మూడు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత వారం రోజులుగా భారీ వర్షాలతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల తర్వాత వరంగల్, సిరిసిల్ల పట్టణాలు వరదనీటలో మునిగిపోయాయి. .కాగా, గురువారం కాస్త తెరిపినివ్వడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు.

అయితే, తాజాగా..ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 11న ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడనం తర్వాత 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది.

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 13వ తేదీన నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్‌లలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+