అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి.. అది అల్పపీడనంగా మారగా.. అల్పపీడనానికి తోడు పశ్చిమగాలులు వీస్తుండడంతో ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర , దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలాచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నుండే రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల వర్షాలు మొదలుకాగా శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని పేర్కొంది. కొద్దిరోజులు భారీ వర్షాలు పడటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.

పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కాగా, శనివారం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాాఖాతంలో ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతిదిశ వైపుకు వంపు తిరిగి ఉంది. శనివారం తూర్పు - పశ్చిమ షియర్ జోన్ 15° ఉత్తర అక్షాంశం వెంబడి 3.1కి మీ నుండి 7.6 కి మీ మధ్య ఏర్పడి ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణం వైపుకు వంపు తిరిగి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో, శని, ఆదివారాల్లో అనేక ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. శనివారం భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలున్నాయి. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ కోస్తా తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో "అల్పపీడనం" ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు ఏటవాలుగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ విధంగా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియజేశారు.

వర్షాలతోపాటు వేగంగా ఈదురుగాలులు

వర్షాలతోపాటు వేగంగా ఈదురుగాలులు

శనివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు

శనివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు గంటకు 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి పెనుగాలులు గంటకు 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కడప, కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
సోమవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+