AP/TS Weather Update Today: ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతిదిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

ఋతపవనాల ద్రోణి బికనేర్, అజ్మీర్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం, విశాఖపట్నం మీదగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ ఉన్నది. సోమవారం తూర్పు-పశ్చిమ షియర్ జోన్ 15° ఉత్తర అక్షాంశం వెంబడి 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ రుతుపవనాల ద్రోణిలో కలిసింది. సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి. సోమవారం భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు, మంగళవారం భారీ వర్షాలు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నవి. సోమవారం ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలోనూ విస్తారంగా వర్షాలు

ఏపీలోనూ విస్తారంగా వర్షాలు

అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేకచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు

దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు

కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బుధవారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

సోమవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+