ఆధార్ తరహాలో అపార్ కార్డ్.. ఇది కేవలం విద్యార్థులకే..
ఆధార్' తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వన్ నేషన్ వన్ ఐడీ కార్డును అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు ఈ కార్డు జారీ చేయనున్నారు. అపార్ కార్డు పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అపార్‌కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. అపార్ కార్డ్ పేరుతో వన్ నేషన్-వన్ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనుంది కేంద్రప్రభుత్వం. విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించడం జరిగింది.
17 అంకెలున్న సంఖ్య...
ఈ కార్డుతో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే దగ్గర పొందుపరిచేలా చేస్తోంది కేంద్రం. విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు..అన్ని వివరాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడేలా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతోపాటు 'అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)' అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించడం జరుగుతుంది.

అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ఇలాంటి పద్ధతులను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే 'ఛైల్డ్ ఇన్ఫో' పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్నిఅమలు చేస్తుంది. ఇప్పడు కేంద్రం మరో సంఖ్యను ఇవ్వబోతుంది. కేంద్రం జారీ చేసే ఈ నంబర్ ఒక్కటే సరిపోతుంది. దేశం మొత్తంలో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకూ చదివే విద్యార్థులు సుమారు 26 కోట్ల మంది విద్యార్థులున్నారు. వీరికోసం 17 అంకెలున్న సంఖ్యను ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది జీవిత కాల ఐడిగా..
ఈ అపార్ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణించనున్నారు. దీంట్లో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు అన్నింటిని పొందుపరచున్నారు. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని, వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను తల్లిందండ్రులకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పింది. అక్టోబర్ 16-18 మధ్య తల్లిదండ్రులు, ఉపాద్యాయులతో సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే.. ఈ ఐడీకి ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆ తర్వాత ఎప్పుడైనా సరే దాన్ని ఉపసంహరించుకోవచ్చని కూడా కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
వివరాలన్నీ తెలుసుకోవచ్చు..
ఈ ఆపార్ కార్డ్ బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు అప్పగించించిం కేంద్రం. ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్ ఆచార్య సహస్రబుద్దే దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఈ ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు తదితర వివరాలన్నీతెలుసుకోవచ్చు. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది. అన్ని వివరాలు నమోదు చేసినట్లే పరిగణిస్తాం అని ఏఐసీటీఈ అధికారులు చెబుతున్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications