Exams: ఫ్రెండ్ అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య, స్కూల్లో ?

బెంగళూరు: 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం ఆ అబ్బాయి స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ లో ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. పరీక్షలో ఆ అబ్బాయి మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డాడు. విషయం గుర్తించిన టీచర్లు ఆ అబ్బాయిని స్కూల్ బయట నిలబెట్టారు. స్కూల్ పూర్తి అయిన తరువాత ఆ అబ్బాయి అతని స్నేహితుడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. స్నేహితుడి ఫ్లాట్ కు వెళ్లిన ఆ అబ్బాయి 14వ అంతస్తు నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పరీక్షల్లో చూసిరాసి చిక్కిపోయానని ఆ అబ్బాయి అవమానంగా బావించాడని టీచర్లు అంటున్నారు. అయితే అబ్బాయి కుటుంబ సభ్యులు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, యాజమాన్యం మీద కేసు పెట్టారు.

10వ తరగతి అబ్బాయి

10వ తరగతి అబ్బాయి

బెంగళూరు సిటీలోని నాగవార సమీపంలోని మోహీన్ నగర్ లో మోహమ్మద్ నూర్, నేహరా దంపతులు నివాసం ఉంటున్నారు. మోహమ్మద్ నూర్, నేహరా దంపతల కుమారుడు మోహీన్ ఖాన్ అలియాస్ మోహిన్ (16) ఓ ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు.

పరీక్షల్లో చూసిరాసిన విద్యార్థి

పరీక్షల్లో చూసిరాసిన విద్యార్థి

10వ తరగతి చదువుతున్న మోహీన్ బాగా చదవాలని అతనికి కుటుంబ సభ్యులు చెప్పారు. మోహీన్ క్రమం తప్పకుండా ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం మోహీన్ స్కూల్ కు వెళ్లాడు. మంగళవారం మద్యాహ్నం స్కూల్ లో ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. పరీక్షలో మోహీన్ మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డాడు.

ఫ్రెండ్ అపార్ట్ మెంట్ కు వెళ్లిన మోహీన్

ఫ్రెండ్ అపార్ట్ మెంట్ కు వెళ్లిన మోహీన్

పరీక్షల్లో మోహీన్ మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నాడని విషయం గుర్తించిన టీచర్లు అతన్ని స్కూల్ బయట నిలబెట్టారు. సాయంత్రం స్కూల్ పూర్తి అయిన తరువాత క్లోజ్ ఫ్రెండ్ తో కలిసి సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిగ్నేచర్ అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు. అప్పుడప్పుడు స్నేహితుడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు మోహీన్ వెళ్లి వస్తుండటంతో ఎవ్వరికి అనుమానం రాలేదు.

14వ అంతస్తు పైనుంచి దూకేశాడు..... రక్షించాలని చూసినా ?

14వ అంతస్తు పైనుంచి దూకేశాడు..... రక్షించాలని చూసినా ?


స్నేహితుడితో మాట్లాడుతున్న మోహీన్ ఒక్కసారిగా అపార్ట్ మెంట్ లోని 14వ అంతస్తులోని టెర్రాస్ మీదకు వెళ్లాడు, విషయం గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు మోహీన్ ను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే అక్కడి నుంచి దూకేసిన మోహీన్ కిటికిని పట్టుకున్నాడని, అక్కడ కూడా అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు.

సెకన్లలో జరిగిపోయింది..... స్పాట్ లో చనిపోయాడు

సెకన్లలో జరిగిపోయింది..... స్పాట్ లో చనిపోయాడు

అయితే కొన్ని సెకన్లలో మోహీన్ కిందపడిపోవడంతో స్పాట్ లో చిపోయాడు. అపార్ట్ మెంట్ సెక్కూరిటీ సిబ్బంది సంపిగేహళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్షల్లో చూసిరాసి చిక్కిపోయానని మోహీన్ అవమానంగా బావించాడని టీచర్లు అంటున్నారు. అయితే మోహీన్ కుటుంబ సభ్యులు ప్రైవేట్ స్కూల్ టీచర్లు, యాజమాన్యం మీద కేసు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+