టీవీ సీరియల్లో అభిమాన నటిలా మహిళ ఆత్మహత్య!

కాన్పూర్: టీవీ సీరియళ్లు, సినిమాలు చూస్తూ పలువురు వాటిని అనుకరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్న సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా మరో సంఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. ఓ మహిళ టీవీ సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

కాన్పూర్‌లోని కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన రుచి అనే ఇరవై రెండేళ్ల వివాహిత గత కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఇందుకోసం ఆమె చికిత్స తీసుకుంటోంది.

Aping a suicide scene from a TV serial, a 22 year old woman kills self in Kanpur

శుక్రవారం నాడు టీవీ సీరియల్ చూసింది. ఆ సీరియల్‌లో తన అభిమాన నటి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. శనివారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఆమె, ఆ తర్వాత తన గదికి వెళ్లి ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సీరియల్లో నటి గురించి ఎక్కువ మాట్లాడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమెతన చీరను ఫ్యాన్‌కు వేసి ఉరేసికుందని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులు రుచి రూంకు వెళ్లి చూడగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+