కలామ్: పత్రికలను రాకెట్లలా విసరడం వల్లే..

హైదరాబాద్: పేపర్ బాయ్‌గా పనిచేసినందుకే తాను మిసైల్స్‌కు పనిచేయగలిగానని అబ్దుల్ కలాం చెబుతుడమేవారు. చిన్నప్పుడు రామేశ్వరంలో తన తండ్రికి ఆర్ధికంగా చేయూతనందించేందుకు కలాం పేపర్‌బాయ్‌గా పనిచేసేవారు. వార్తాపత్రికలను ఇళ్లకు వేసేటప్పుడు కొన్ని టెక్నిక్‌లను అనుసరించేవారని అంటారు.

రెండో అంతస్థులో ఉండే ఇళ్లకు అందించే సమయంలో కలాం కిందనుంచే వాటిని రాకెట్ మాదిరిగా చుట్టి పైకి విసిరేవారట. ఇదే తనలో రాకెట్లు, మిసైళ్లు తయారు చేయాలనే కాంక్షను రగిలించిందని కలాం చెప్పేవారు.

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే ఆయన పూర్తిపేరు అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అషియమ్మ, జైనులబపుద్దీన్.

APJ Abdul Kalam

ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త , పదకొండో భారత రాష్ట్రపతి అయిన కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.

అబ్దుల్ కలామ్ దేశానికి అమూల్యమైన సేవలు అందించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను స్వీకరించారు. శాస్త్రవేత్తగా జీవితాన్ని ఆరంభించిన కలామ్ దేశం గర్వించదగిన స్థాయికి ఎదిగారు. రాష్ట్రపతి భవన్‌లో కాలు పెట్టారు.

కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇస్రో, డిఆర్‌డివో, షార్ తదతిర పరిశోధనా కేంద్రాల్లో ఆయన శిష్యులు, ప్రశిష్యులే కీలక పాత్ర పోషిస్తున్నారు. రక్షణ రంగంలోలో కీలక పరిశోధనలు చేసిన ఆయన సోమరాజుతో కలిసి హృద్రోగులకు అమర్చే స్టెంట్‌ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

రామనంతపురం స్క్వార్జ్‌లో ఆయన మెట్రిక్యులేషన్ చేశారు. కాలేజీ విద్యను తిరుచిరాపల్లి సెయింట్ జోసెప్ కాలేజీలో చేశారు. ఆయన ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. 1960లో డిఆర్‌డివో సైంటిస్టుగా తన వృత్తిని ప్రారంభించారు. 1969లో ఇస్రోకు బదలి అయ్యారు. ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 1992-99 మధ్య కాలంలో డిఆర్‌డివో కార్యదర్సిగా పనిచేశారు. ప్రదాని సాంకేతిక సలహాదారుగా వ్యవహరించారు.

కలాం అందుకున్న పురస్కారాలు

1981 - పద్మ భూషణ్
1990 - పద్మ విభూషణ్
1994 - గౌరవ ఫెలో- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్
1997 - భారతరత్న
1997 - నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం
1998 - వీర్ సావర్కర్ అవార్డు
2000 - రామానుజన్ అవార్డ్ - ఆళ్వార్ రీసెర్చ్ సెంటర్, చెన్నై
2007 - కింగ్ చార్లెస్ II పతకం - రాయల్ సొసైటీ, యుకె
2007 - సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ - వోల్వర్‌థాంప్టన్ విశ్వవిద్యాలయం, యుకె
2008 - ఇంజనీరింగ్ డాక్టర్ - నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్
2009 - గౌరవ డాక్టరేట్ - ఓక్లాండ్ యూనివర్శిటీ
2009 - హూవర్ పతకం - ASME ఫౌండేషన్, అమెరికా
2009 - ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు - కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
2010 - ఇంజనీరింగ్ డాక్టర్-వాటర్లూ విశ్వవిద్యాలయం
2011 - IEEE గౌరవ సభ్యత్వం
2012 - గౌరవ డాక్టరేట్ - సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం
2014 - సైన్స్ డాక్టరేట్ - ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+