జయ హెల్త్ బులిటెన్ విడుదల: ఉద్వేగానికి లోనై పార్టీ కార్యకర్త మృతి

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ట్రీట్‌మెంట్‌కు జయలలిత స్పందిస్తున్నారని, ఆదివారంతో పోలిస్తే ఆమె ఆరోగ్యం మరింతగా మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక బృందం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని వైద్యులు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.

కొద్ది రోజుల పాటు చికిత్స నిమిత్తం ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటి బయోటిక్స్ ఇస్తున్నందున ఆమె నుంచి ప్రతిస్పందనలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజులు ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలోనే ఆమె ఉంటారని వైద్యులు పేర్కొన్నారు.

 Apollo says Jayalalithaa responding well; concerned AIADMK worker dies of stroke

మరోవైపు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నా, అమ్మ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే జయలలిత ఆరోగ్యంపై మీడియాలో ప్రసారమవుతున్న వార్తలతో కలత చెందిన ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కొయంబత్తూరులో చోటుచేసుకుంది.

కొయంబత్తూరులోని విమానాశ్రయం సమీపంలో ముత్తుస్వామి (74) అనే అన్నాడీఎంకే కార్యకర్త నివసిస్తున్నారు. ఆయనకు జయలలిత అంటే అంతులేని అభిమానం. సెప్టెంబరు 22న అనారోగ్య కారణాలతో జయలలిత ఆసుపత్రిలో చేరిన తరువాత, ముత్తుస్వామి ఇంట్లోను, స్నేహితుల వద్ద రోజూ ఇదే విషయాన్ని చర్చిస్తుండేవాడు.

జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఉద్వేగానికి లోనయ్యేవాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వారంతా ఆమె క్షేమంగా ఉంటారని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని భరోసా ఇచ్చేవారు. కానీ, తమిళనాడు ఇన్‌‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు జయను పరామర్శించి వెళ్లడం అతనిలో మరింత ఆందోళనను పెంచింది.

ఇదే సమయంలో జయ ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా పుకార్లు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ముత్తుస్వామి ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వేగంగా స్పందించి, అతనిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముత్తుస్వామి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+