ఎంపీ సాక్షి ముందు అమ్మాయి జీన్స్ విప్పించారు(వీడియో)
లక్నో: భారతీయ జనతా పార్టీ వివాదాస్పద ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ వివాదాలతో, సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే ఆయన.. మరోసారి వివాదాస్పదమయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో అక్కడున్న కొంతమంది మహిళలతో మాట్లాడుతున్న క్రమంలో ఓ బాలికను తను వేసుకున్న జీన్స్ ప్యాంట్ బటన్ తొలగించి, గాయాల గుర్తులు చూపించమని అడిగారు సాక్షి మహారాజ్. దీంతో ఆమె అలాగే చేసింది.
అయితే, కొంతమంది మహిళలు, పురుషులు చూస్తుండగానే సాక్షి మహరాజ్ ఇలా ఆదేశించడం వివాదానికి దారితీసింది. అందరి ముందు ఓ బాలికను ఆమె శరీరంపై అయిన గాయాల గుర్తులు చూపించాల్సిందిగా ఆదేశించడం విమర్శలకు తావిచ్చింది.

కొంతమంది మహిళలు, బాలికలు ఆయనకు సేవలు చేస్తుండగా.. చూస్తూ ఉండటంపై విమర్శలు చెలరేగాయి. కాగా, సాక్షి మహారాజ్ అమర్యాదకరమైన ప్రవర్తనపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
మరో వైపు సాక్షి మహారాజ్ కావాలని అలా చేయలేదు. బాలిక బంధువులు గాయాలైన విషయం తెలపడంతోనే చూపించమని అడిగారని మరికొందరంటున్నారు. 'ఎంపీ మహరాజ్.. ఆమెను ఏమైనా వేధింపులకు గురిచేశాడా? గాయాలు చూపాలని మాత్రమే అడిగారు' అని, సదరు ఎంపీపై అనవసరమ ఆరోపణలు మానుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.
BJP MP, Sakshi Maharaj asked a Lady 2 remove her pants in Public to Show her wounds #असंस्कारी_बीजेपी pic.twitter.com/yToXrlypal
— Aarti (@aartic02) May 5, 2016












Click it and Unblock the Notifications