యాపిల్ ఆఫర్ : ఐఫోన్ 11 విడుదల...పాత ఐఫోన్ మోడల్స్ ధర భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ: ఐఫోన్... అది ఏ మోడల్ అయినా సరే చేతిలో ఉంటే అదొక స్టేటస్ సింబల్‌గా ఫీలవుతారు. తాజాగా యాపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో కొన్ని పాత మోడల్ ఐఫోన్‌ల ధరలను తగ్గిస్తూ సంచలన ప్రకటన చేసింది యాపిల్ సంస్థ. ఇలా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన వాటిలో ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ 7 కూడా ఉన్నాయి. ఈ ధరలన్నీ భారత్‌లో కూడా తగ్గాయి.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ కొత్త ధరలు

ఐఫోన్ ఎక్స్‌ఆర్ కొత్త ధరలు

యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ అసలు ధర గతేడాది రూ.76900 ఉండగా ఇప్పుడు ప్రారంభ ధర రూ. 49,900గా ఉంది. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఎస్ ధర ప్రస్తుతం రూ. 89,900గా ఉంది. దీని అసలు ధర రూ. 99,900తో ప్రారంభమైంది. ఇక యాపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ 64 జీబీ ఇప్పుడు రూ.49,900కే లభిస్తోంది. 128 జీబీ మోడల్ ధర రూ. 54,900కు లభిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ 256 జీబీ ప్రస్తుతం రూ.1,03,900 ఉండగా దీని పాత ధర రూ. 1,14,900గా ఉండేది.

 ఐఫోన్ 8, ఐఫోన్ 7 ప్లస్ ధరలు

ఐఫోన్ 8, ఐఫోన్ 7 ప్లస్ ధరలు

యాపిల్ ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ ధర ప్రస్తుతం రూ. 49,900గా ఉంది. ఇప్పుడు ఐఫోన్ 8, 64 జీబీ మోడల్ రూ.39,900కే లభిస్తోంది. ఇక ఐఫోన్ 7, 32 జీబీ మరియు 128 జీబీలు వరుసగా రూ. 29,900 మరియు రూ.34,900గా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ 32జీబీ మోడల్ ఫోన్ రూ.37,900 ఉండగా.. 128 జీబీ ధర రూ.42,900గా ఉంది. ఇదిలా ఉంటే ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ ధరలపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఐఫోన్ 11 ధరలు ఇలా ఉన్నాయి

ఐఫోన్ 11 ధరలు ఇలా ఉన్నాయి

ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసిన తర్వాత ధరల తగ్గించాలన్న నిర్ణయం తీసుకుంది యాపిల్ యాజమాన్యం. ఐఫోన్ ఎక్స్‌ఆర్‌కు అడ్వాన్స్‌గా వస్తున్న ఐఫోన్ 11, 64 జీబీ, 128జీబీ, 256 జీబీ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 64,900గా ఉంది. ఈ మూడు పర్పుల్, గ్రీన్, ఎల్లో, బ్లాక్, వైట్, రెడ్ కలర్స్‌లో వస్తున్నాయి. ఇక ఐఫోన్‌ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ధరల ప్రారంభం రూ. 99,900 నుంచి రూ.1,09,900 గా ఉన్నాయి. సెప్టెంబర్ 27 నుంచి ఐఫోన్ 11 సిరీస్‌ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+