25 చోట్ల పనిచేయలేదు, జాబ్‌కు మాత్రం ఆప్లై చేశా, కొత్త మలుపు తిరిగిన యూపీ రూ.కోటి స్కాం కథ..
ఒక మహిళ.. 25 కొలువులు, 13 నెలల నుంచి రూ.కోటి ప్రభుత్వ నగదు విత్ డ్రా... కానీ తెరపైకి అనామిక శుక్లా వచ్చారు. ఇప్పటివరకు ఆమెను 25 ఉద్యోగాలు చేసి.. నగదు తీసుకున్నారని అనుకోవడంతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. తాను ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ ఒక్క ఉద్యోగంలో కూడా చేరలేదని తెలుపడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందుకు గల కారణాలను కూడా ఆమె వెల్లడించింది. ఇంతకీ యూపీ కస్తూర్బా స్కూల్ టీచర్ స్కాంలో హస్తం ఎవరిదీ..? ఆ నగదు ఎవరు విత్ డ్రా చేశారు.
Recommended Video

గర్భవతిని కావడంతో
యూపీలోని పలు జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశానని అనామికా శుక్లా పేర్కొన్నారు. కానీ తాను ఉద్యోగంలో చేరలేదని.. ఆ సమయంలో తాను గర్భవతినని తెలిపారు. అయితే తాను 2017 నుంచి వివిధ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశానని తెలిపారు. అయితే సదరు పాఠశాలల నుంచి తన సర్టిఫికెట్లు ఎవరైనా తీసుకుని ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. లేదంటే సర్టిఫికెట్లను ఎవరైనా తస్కరించి ఉంటారా అని సస్పెక్ట్ చేశారు. తర్వాత కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ టీచర్‌గా పనిచేయాలని కాల్స్ వచ్చాయని.. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో వీలు కాలేదన్నారు.

ఎవరో మిస్ యూజ్ చేశారు
అయితే తన సర్టిఫికెట్లు ఎవరూ మిస్ యూజ్ చేశారో అర్థం కావడం లేదన్నారు. మోసానికి సంబంధించి వార్తలో చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. తర్వాత బేసిక్ శిక్ష అధికారి వద్దకు వెళ్లి.. తన వద్ద గల సర్టిఫికెట్లను చూపించానని తెలిపారు. ఇందులో తన తప్పు లేదు అని.. మోసం చేసినవారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆమె భర్త దుర్గేశ్ శుక్లా కూడా ఎవరో కావాలని చేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తమ పరువుపోయిందని.. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇలా బయటపడింది
యూపీ విద్యాశాఖ అధికారులు డాటా బేస్‌లో వివరాలు వెలికితీస్తుండగా కుంభకోణం బయటపడింది. మెయిన్ పురికి చెందిన అనామిక శుక్లా.. 25 స్కూళ్లలో పనిచేస్తున్నారని గుర్తించారు. 13 నెలలుగా రూ. కోటి నగదు విత్ డ్రా చేసినట్టు గుర్తించారు. దీంతో ఆమెకు వేసవిలో జీతం వేయలేదు. అమేథీ, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, ప్రయాగ్ రాజ్, అలీఘర్ సహా 25 చోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులో ఉంది. దీంతో మోసం బయటపడింది. దీనిపై విద్యాశాఖ విచారణకు కూడా ఆదేశించింది. ఈ క్రమంలో అనామికా శుక్లా.. తాను పనిచేయడం లేదు అని.. తన సర్టిఫికెట్లను ఎవరో మిస్ యూజ్ చేశారని అనడంతో స్కాం కొత్త మలుపు తీసుకుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications