ఇక పోస్ట్ ఆఫీసులో పాస్ పోర్ట్ ఆప్లై చేయవచ్చు.. ఇస్మార్ట్‌గా సేవలు
పోస్టాఫీసులు ఇస్మార్ట్ గా మారుతున్నాయి. ఒక్కోసేవను పెంచుకుంటూ పోతూ ప్రజలకు మరింత దగ్గర అవుతున్నాయి. ఇండియా పోస్ట్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను ప్రారంభించింది. ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.
ఇప్పుడు పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తులను కూడా ఇండియా పోస్ట్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. ఇకపై, దేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో కూడా పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్ కౌంటర్లను సందర్శించాల్సి ఉంటుంది.

పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాలను ప్రారంభించిన సంగతి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం అని తెలిపింది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించాలని ట్వీట్‌లో పేర్కొంది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రింట్ రసీదు, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసులో కూడా సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications