వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి ఇలాంటి ప్రశ్న?: ఆశ్చర్యం.. ఎవరా జర్నలిస్టు!, ఏమా ప్రశ్న?

ఇంతకీ మోడీని కెల్లి ఏం ప్రశ్నించారంటే!.. 'మీకు ట్విట్టర్ ఖాతా ఉందా'? అని. ప్రపంచంలోని చాలామంది దేశాధినేతల కన్నా ట్విట్టర్ లో ఎక్కువ ఫాలోయింగ్ కలిగివున్న మోడీని ఇలాంటి ప్రశ్న వేయడం.

|
Google Oneindia TeluguNews

మాస్కో: ఇంటర్వ్యూలు చేయడమంటే.. ఆదరాబాదరాగా ఏదో మేనేజ్ చేస్తే సరిపోతుందిలే అన్నట్లు వ్యవహరిస్తే కొన్నిసార్లు బొక్క బోర్లా పడక తప్పదు. ఎవరినైతే ఇంటర్వ్యూ చేయబోతున్నామో.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు, ఏ రంగంలో వారు రాణిస్తున్నారన్న విషయాలపై ఒక నిర్దిష్ట అవగాహన ఉంటే తప్ప అడిగే ప్రశ్నల్లోను పస ఉండదు.

అదీ ఓ దేశానికి ప్రధాని అయిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అలా కాకుండా ఏదో కానిచ్చేసామా? అన్నట్లు నోటికొచ్చినట్లు ప్రశ్నలడిగితే కచ్చితంగా దెబ్బయిపోతారు. తాజాగా నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ(ఎన్‌బీసీ)కి చెందిన మెగిన్ కెల్లీ అనే జర్నలిస్టు కూడా ఇలాగే దెబ్బయిపోయారు. భారత ప్రధాని మోడీని కెల్లీ అడిగిన ప్రశ్న.. ఆయన పట్ల ఆమె అవగాహనరాహిత్యాన్ని బహిర్గతం చేసింది.

 Are you on Twitter? Noted journalist Megyn Kelly asks PM Narendra Modi, gets slammed on social media

ఇంతకీ మోడీని కెల్లి ఏం ప్రశ్నించారంటే!.. 'మీకు ట్విట్టర్ ఖాతా ఉందా'? అని. ప్రపంచంలోని చాలామంది దేశాధినేతల కన్నా ట్విట్టర్ లో ఎక్కువ ఫాలోయింగ్ కలిగివున్న మోడీని ఇలాంటి ప్రశ్న వేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కెల్లీ జర్నలిజంపై నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు. ఆమె ఓ తెలివి తక్కువ జర్నలిస్టు అంటూ విమర్శలు గుప్తిస్తున్నారు.

కాగా, సెయింట్ పీటర్‌బర్గ్స్‌లోని కొన్‌స్టాటిన్ ప్యాలెస్‌లో శుక్రవారం విందు కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. అంతకుముందు రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్, జర్నలిస్టు కెల్లీతో కాసేపుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెల్లీ మోడీని 'మీకు ట్విట్టర్ ఖాతా ఉందా?' అంటూ ప్రశ్నించింది. కెల్లీ అడిగిన అమాయకపు ప్రశ్నకు మోడీ తనదైన శైలిలో బిగ్గరగా నవ్వేశారట.

ఏదేమైనా కెల్లీపై నెటిజెన్స్ దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్ లో 3.3కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న మోడీని, కేవలం 23లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్న కెల్లీ ఇలాంటి ప్రశ్న అడగడమా? అని దుయ్యబడుతున్నారు. ఈ దెబ్బకు ప్రపంచం ముందు కెల్లీ పరువు పోయినట్లయింది.

English summary
National Broadcasting Company (NBC) journalist Megyn Kelly must be ruing the she didn't do her homework properly before meeting Prime Minister Narendra Modi in St. Petersburg. The famous journalist is facing severe flak from netizens for asking PM Modi whether he was on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X