రాంపాల్ ఆశ్రమం: భారీగా ఆయుధాలు, బాత్‌రూంలో స్త్రీ
చండీగఢ్: హత్య కేసులో అరెస్టైన వివాదాస్పద బాబా రాంపాల్‌కు చెందిన సత్ లోక్ ఆశ్రమంలో హర్యానా పోలీసులు శుక్రవారం పెద్దమొత్తంలో ఆయుధ సామాగ్రిని గుర్తించారు. ఇందులో వివిధ రకాల తుపాకులు, తూటాలు, పెట్రోలు బాంబులు, యాసిడ్ సిరంజీలు, మిర్చి గ్రెనేడ్ ఉన్ాయి. ఆయుధ సామాగ్రి చాలా వరకు రెండు రహస్య గదుల్లో దాచి ఉంచారు.
కంచుకోటలా ఉన్న ఆశ్రమం మధ్యలో రాంపాల్ కూర్చునే నిర్మాణం కింద ఆయుధ సామాగ్రిని దాచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. తనిఖీల్లో రాంపాల్ గదిని ఆనుకొని ఉన్న ఓ గదిలో గర్భధారణ పరీక్ష పట్టీ లభించింది. తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిలో మహిళ అపస్మారక స్థితిలో కనిపించారు.
ఆమెను మధ్యప్రదేశ్‌కు చెందిన బిజ్లేష్‌గా గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమ ప్రాంగణంలో దాక్కొని ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో 24 ఏసీ గదులు ఉన్నాయి. ఓ ఏసీ గదిలో మర్దన మంచం కూడా ఉంది. అరెస్టుకు ముందు రాంపాల్‌కు పోలీసులు మంచు అనే సంకేత నామం పెట్టుకున్నారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఈ ఆశ్రమాన్ని శుక్రవారం అంగుళం అంగుళం శోధించారు. సోదా వివరాలను పోలీసు విభాగం ప్రతినిధి వెల్లడించారు. పాయింట్ 32 రివాల్వర్లు, 19 ఎయిర్‌గన్లు, పాయింట్ 315 బోర్ రైఫిళ్ళు, 28 తూటాలు, వివిధ పరిమాణం గల తూటాలను భారీ సంఖ్యలోనే స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఈ ఆయుధాలన్నింటినీ రహస్య గదుల్లోని అల్మరాల్లోనూ, బ్యాగుల్లోనూ దాచినట్లుగా తెలిపారు. ఈ ఆశ్రమంలో రాంపాల్ కూర్చునేందుకు ఓ ఎత్తయిన వేదిక ఉందని, ఎవరూ అనుమానించడానికి వీలు లేకుండా దానిలోపే ఈ ఆయుధాలను దాచారని పోలీసులు తెలిపారు.
ఓ ప్రైవేటు స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక ఎలివేటర్, మసాజ్ సౌకర్యం కలిగిన పడకతో పాటు 24 ఏసి గదులు ఈ సోదాలో వెలుగుచూశాయబదబాకం. అలాగే హెల్మెట్లు, కర్రలు, 20 జతల నల్లదుస్తులు, 800 లీటర్ల డీజిల్ కలిగిన రెండు ట్యాంకులు కూడా ఆశ్రమంలో ఉన్నాయని తెలిపారు.
ఒక కోటను తలపించే చందంగా నిర్మించిన ఈ ఆశ్రమం చుట్టూ ఎత్తయిన గోడలు, వాటిపై గంట స్తంభాలు ఉన్నాయి. అలాగే రాంపాల్ భద్రత కోసం ప్రైవేటు కమాండోలు సహా పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారన్నారు. అనేక కీలక ప్రాంతాల్లో ఎవరు వచ్చినా కూడా కనిపెట్టేలా సిసి టీవీ కెమెరాలను కూడా అమర్చినట్లు తెలిపారు. భక్తులను సోదా చేయడానికి మెటల్ డిటెక్టర్లను కూడా ఈ ఆశ్రమంలో గుర్తించినట్లు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications