ఇమిగ్రేషన్ క్లియరెన్స్: ఆర్మీ చీఫ్‌కూ తప్పని నిరీక్షణ
న్యూఢిల్లీ: భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వ్యవస్ధ ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో చెప్పడం కష్టం. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వ్యవస్ధ పనిచేయకపోతే ఎంతటివారైనా క్యూలో వేచి చూడాల్సిందే. సరిగ్గా ఇలాంటి అనుభూతినే ఎదుర్కొన్నారు ఆర్మీ ఛీప్ జనరల్ దల్బీర్ సింగ్.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇచ్చే కంప్యూటర్ల వ్యవస్థ పని చేయకపోవడంతో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ బుధవారం సామాన్యుడిలా 30 నిమిషాలపాటు లైన్లో నిలబడ్డారు. సాధారణంగా విమానాశ్రయ సిబ్బంది వీఐపీలకు క్లియరెన్సులు తొందరగా అయ్యేలా చూస్తారు.

ఇమిగ్రేషన్ క్లియరెన్స్ బ్యూరో వ్యవస్ధ మొరాయించడంతో, ఆయన ఎక్కాల్సిన దుబాయ్ విమానంతో పాటు పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు మొరాయించిన ఇమిగ్రేషన్ క్లియరెన్స్ వ్యవస్ధ 9.40కి బాగైంది. ఆ తర్వాత నుంచి క్లియరెన్స్ మొదలు పెట్టడంతో సుమారు 12కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.












Click it and Unblock the Notifications