రేప్ కేసులో సైనికుడి అరెస్టు

శ్రీనగర్: ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసి పరారైన సైనికుడిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఓ సైనికుడు ఇంటిలో చోరబడి మహిళను బెదిరించి అత్యాచారం చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

6 ఇంజనీర్స్ రెజిమెంట్ లో హక్ నవాజ్ సైనికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కాశ్మీర్ లో పోస్టింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హక్ నవాజ్ సెలవులో ఉన్నాడు. పూంచ్ జిల్లాలోని మన్ కోటే ప్రాంతంలో ఓ ఇంటిలోకి హక్ నవాజ్ చోరబడ్డాడు.

Army jawan arrested for rape in Poonch district of Jammu and Kashmir

తరువాత మహిళను బెదిరించి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించి అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పూంచ్ జిల్లా పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.

తప్పించుకుని తిరుగుతున్న హక్ నవాజ్ ను గుర్తించి అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. హక్ నవాజ్ ను బాధితురాలు గుర్తు పట్టిందని కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+