పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై సైనికుడు రేప్

Army man held for raping minor
థేనీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ సైనికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని థేనీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. థేనీ జిల్లాలోని చిన్నమనూరు సమీపంలోని వెల్లాయమ్మపురంకు చెందిన పేరుమాల్ అనే వ్యక్తి కుమారుడు కుమార్. ఇతను సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా, అదే గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పిన కుమార్, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు.

ఇంటికి వచ్చిన బాలిక ప్రవర్తన ఆందోళనకరంగా ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఆమె జరిగిన విషయాన్ని తెలిపింది. బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కుమార్‌ను అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న కుమార్ సెలవుపై తన సొంతగ్రామానికి వారం రోజులపాటు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ సమయంలోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడితోపాటు అతని సహకరించిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+