రోజూ చస్తున్నారు: సైనికులపై బిజెపి ఎంపి నోటి దురుసు
Recommended Video

న్యూఢిల్లీ: సైనికుల మరణాలపై బిజెపి పార్లమెంటు సభ్యుడు నేపాల్ సింగ్ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల చేతిలో ఐదుగురు జవాన్లు మరణించిన సంఘటనపై ఆయన స్పందిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
పోరాటంలో సాయుధ బలగాలు మరణించని దేశమంటూ లేదని, అది నిత్య వ్యవహారమని ఆయన అన్నారు. సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు, చస్తుంటారని, అందులో కొత్తేముందని ఆయన అన్నారు.

సైన్యంలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినప్పుడు - మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోకసభ సభ్యుడైన 77 ఏళ్ల నేపాల్ సింగ్ వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. తీవ్రమైన విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గక తప్పలేదు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని, ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు చెప్తున్నానని ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చి అన్నారు.
సైనికుల ప్రాణాలు కాపాడేలా ఓ ఆయుధం కనిపెట్టాలని తాను శాస్త్రవేత్తలను కోరానని ఆయన అన్నారు. సైనికులను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications