మానసిక వికలాంగురాలైన యువతిపై సైనికాధికారి రేప్: అరెస్ట్
నాసిక్: 21ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఆర్టిలరీ సెంటర్‌లో సీనియర్ సైనికాధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డియోలాలి క్యాంపులోని అతని నివాసంలోనే ఆ అధికారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు కాల్నల్ వినోద్ సహానీని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను ఏసిపి(డివిజన్1) అతుల్ జెండే తెలిపారు.

డియోలాలి క్యాంపు ప్రాంతంలోనే నిందితుడు అతని కుటుంబసభ్యులతోపాటు నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 30న తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లిన వినోద్ సహానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని డియోలాలి క్యాంపు పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి రాజేష్ అఖడే తెలిపారు.
బాధితురాలు మానసిక వికలాంగురాలని పోలీసులు చెప్పారు. కాగా, తనను కావాలని ఈ కేసులో ఇరికించారని విచారణ సమయంలో సహానీ ఆరోపించారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications