కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వీరే
జమ్మూకాశ్మీర్ లో కార్యకలాపాలు సాగిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన జాబితాను సైన్యం గురువారం నాడు విడుదలచేసింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో కార్యకలాపాలు సాగిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన జాబితాను సైన్యం గురువారం నాడు విడుదలచేసింది.
లష్కరనే కమాండర్ అబూ దుజానా బహీర్ వాని సహా 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు రియాజ్ నైకో, మహ్మద్ యాసిన్ ఇట్టో, అల్తాప్ దార్, లష్కర్ జిల్లా కమాండర్ జునైద్ మట్టూ ఫోటోలు కూడ జాబితాలో ఉన్నాయి.

సోపోర్ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన దాడిలో ఇద్దరు తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హతమైన ఇద్దరు తీవ్రవాదులు స్థానికులేని , వీరికి హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని కాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి వేద్ తెలిపారు. వీరి నుండి రెండు ఏకే 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి, రూ.2 వేలు, రెండు రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకొన్నారు.
జమ్మూకాశ్మీర్ లో కార్యకలాపాలు సాగిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన జాబితాను సైన్యం గురువారం నాడు విడుదలచేసింది.












Click it and Unblock the Notifications