నా భర్త అమయాకుడు: అరెస్టైన టెక్కీ భార్య
బెంగళూరు: తన భర్త చాలా అమాయకుడని ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణపై అరెస్టయిన బెంగళూరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అఫ్జల్ భాహర్య బస్రా మీడియాతో అన్నది. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు తన భర్త తలకు గన్ గురి పెట్టి బెదిరించారని ఆమె అన్నది.
తాము ఢిల్లీ పోలీసులమని వారు చెప్పారమని, కానీ ఏ విధమైన ధ్రువీకరణ చూపించలేదని, తనను కూడా తుపాకితో బెదిరించారని ఆమె మీడియాతో అన్నది. తనకు తుపాకి గురి పెట్టి ఆయుధాలు ఎక్కడున్నాయని అడిగారని చెప్పింది.

ఏ విధమైన అరెస్టు వారెంట్, సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి వచ్చిన తన భర్తను తీసుకుని వెళ్లారని ఆమె చెప్పింది. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణపై పలువురని దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా కర్ణాటకలో అఫ్జల్‌తో పాటు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఎన్ఐఎ అధికారులు విచారిస్తున్నట్లు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చెప్పారు.












Click it and Unblock the Notifications