ఈసీగా అరుణ్ గోయల్, రాష్ట్రపతి ముర్ము ఆమోదం, తక్షణమే అమల్లోకి
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకం అయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ నియమానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో తక్షణమే నియామకం అమల్లోకి వస్తోందని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అరుణ్ గోయల్ 1985 పంజాబ్ ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో కలిసి పనిచేస్తారు. రాజీవ్ కుమార్ గత మే నెలలో సీఈసీ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగగా.. గుజరాత్‌కు రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఏడాదిన్నర సమయంలో లోక్ సభకు ఎన్నిక జరుగుతుంది.












Click it and Unblock the Notifications