బడ్జెట్ ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్‌కు ఐఐఎం, ఆర్థిక సహాయ నిధి
న్యూఢిల్లీ: 2015-16 బడ్టెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్టెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఇది.
కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
ప్రణాళికా వ్యయం 4,65,000 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఐఎం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందిస్తామని, అందుకు ప్రత్యేక సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విభజన సమయంలో తెలంగాణకు, ఎపిలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అరుణ్ జైట్లీ చెప్పారు. ఆర్థిక వెనకబడిన బెంగాల్, బీహార్ రాష్ట్రాలతో పాటు ఎపికి కూడా ప్రత్యేక ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
- డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
- ఉన్నత విద్య కోసం ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం
- హైదరాబాదులో కుతుబ్ షాహీ సమాధుల రక్షణకు నిధులు
- బీహార్‌లో ఎయిమ్స్ తరహాలో మరో సంస్థ
- జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు
- 5 లక్షల గ్రామాలకు వైపై సౌకర్యం
- 25 చారిత్రక కట్టడాల పరిరక్షణనకు ప్రత్యేక నిధులు
- జమ్మూ కాశ్మీర్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎయిమ్స్
- విమానాశ్రయంలో దిగిన వెంటనే వీసాల సౌకర్యం 43 దేశాల నుంచి 150 దేశాలకు పెంపు
- ఆర్థిక వ్యవహారాల పరిష్కారం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
- మన స్టాక్ మార్కెట్లను ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయడానికి చర్యలు
- పారదర్శకతతో పవర్ ప్రాజెక్టు టెండర్లు
- ఒకే గొడుగు కిందికి ఎఫ్ఎంసి, సెబీ
- అశోక్ చక్ర పేరుతో గోల్డ్ కాయిన్లు
- నల్లధనాన్ని కట్టడి చేసేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల పెంపు
- నగదు లావాదేవీలు లేని విధానం వైపు అడుగులు వేద్దాం
- ఈపిఎఫ్‌లో ఉద్యోగులకు పింఛను పథకాలను ఎంచుకునే సౌకర్యం
- నిర్భయ ఫండ్‌కు అదనంగా వేయి కోట్ల రూపాయల కేటాయింపు
- ఐసిడిఎస్ కు రూ.1500 కోట్ల కేటాయింపు
- మౌలిక సదుపాయల కోసం 70 వేల కోట్లకేటాయింపు
- ఇన్నోవేషన్, పరిశోధనల కోసం 150 కోట్ల కేటాయింపు
- స్టార్టప్, బిజినెస్ ఇంక్యుబేషన్ కోసం వేయికోట్ల కేటాయింపు
- ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్ల కేటాయింపు
- పరిశ్రమల స్థాపనకు 14 అనుమతుల కోసం పోర్టల్
- అటల్ పింఛన్ యోజన పథకానికి ప్రభుత్వం 50 శాతం సహాయం
- ఐదు ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదన
- రైళ్లు, రోడ్డు, నీటిపారుదల ప్రాజెక్టులకోసం బాండ్ల జారీ
- ఈపిఎఫ్‌లో ఎవరికీ చెందని 3 వేల కోట్ల రూపాయలు వృద్ధుల సంక్షేమానికి ఖర్చు
- జనధన్ యోజన, బొగ్గు గనుల వేలం, స్వచ్ఛ భారత్ మా విజయాలు
- గ్రామీణ వ్యవసాయానికి, మౌలిక సదుపాయాలకు 25 వేల కోట్ల కేటాయింపు
- కొత్తగా రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, జ్యోతి బీమా యోజన
- పేదలకు ఏడాదికి రూ. 12 ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా
- సూక్ష్మ సేధ్యం కోసం 5300 కోట్ల కేటాయింపు
- మరో లక్ష కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం
- సిబ్సిడీలో దుర్వినియోగాన్ని నిరోధిస్తాం
- బ్యాంకుల ద్వారా రైతులకు రుణాల లక్ష్యం 8.5 లక్షల కోట్లు
- నూతన పారిశ్రామికవేత్తల కోసం ముద్ర బ్యాంక్ ఏర్పాటు
- పోస్టాఫీసుల ద్వారా జన్ ధన్ యోజన
నష్టదాయక కంపెనీల నుంచి, ఆదాయం రాని సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తామని జైట్లీ చెప్పారు ఉద్యోగాలను సృష్టించేవారిగా యువతను తయారు చేయడమే మేక్ ఇన్ ఇండియా లక్ష్యమని చెప్పారు. కేందర్ం నుంచి రాష్ట్రాలకు 60 శాతం నిధులు సమకూర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం నిజంగా కత్తి మీద సామేనని అన్నారు. అత్యున్నత ఆదాయవర్గాలకు గ్యాస్ రాయితీ నిలిపివేస్తామని చెప్పారు. పార్లమెంటు సభ్యులు కూడా గ్యాస్ రాయితీని వదులుకోవాలని సూచించారు. స్టార్టప్‌లు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
వృద్ధి రేటును రెండంకెలకు తీసుకుని వెళ్తామని జైట్లీ చెప్పారు. 2016 ఏప్రిల్ 1వ తేదీ నాటికి జిఎస్‌టిని అమలులోకి తెస్తామని అన్నారు. 2020నాటికి విద్యుదీకరణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయం, సాగునీరి, అగ్రి ప్రాసెసింగ్‌లను ఒక గొడుగు కిందికి తెస్తామని చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పథకాలను రూపొందిస్తామని అన్నారు. 2022నాటికి పట్టణ ప్రాంతాల్లో 2 కోట్లు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో కళాశాల ఉండేలా చూస్తామని అన్నారు.
ద్రవ్యోల్బణం నియంత్రణలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని జైట్లీ చెప్పారు. 2015 -16లో ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం నుంచి 5.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసినట్లు జైట్లీ చెప్పారు. మిగతా కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలపడిందని అన్నారు.
అభివృద్ధిలో రాష్ట్రాలు కీలకమని, రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామని జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బనం 5.1 శాతం తగ్గినట్లు తెలిపారు. ప్రపంచం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోందని అన్నారు. పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశమని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని ప్రపంచం గుర్తించిందని అన్నారు. లిజేశీ మారకం నిల్వలు 320 బిలియన్లకు చేరినట్లు తెలిపారు 50 లక్షల మరుగుదొడ్డ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 6 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని జైట్లసీ అన్నారు.
ఆర్థిక వృద్ధిలో రాష్ట్రాలకు సమభాగస్వామ్యం కలిగి ఉండాలని తాము కోరుకుంటున్నామని అరుణ్ జైట్లీ అన్నారు. గత 9 నెలల్లో ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదికి ఎక్కించడానికి ఎన్డిఎ ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు. ఆర్థిక వృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
2015 - 16 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రతులు పార్లమెంటుకు చేరుకున్నాయి. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆయన ఉదయం తొమ్మిది గంటలకో నార్త్ బ్లాక్ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని జైట్లీ ఇదివరకే చెప్పారు. రాష్ట్రాల పట్ల బడ్జెట్‌లో ఉదారంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పన్ను రాయితీలు ఇవ్వాలని ఆ రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కోరారు.
అరుణ్ జైట్లీ బడ్జెట్ పెద్దగా పథకాలను ప్రకటించకపోవచ్చునని అంటున్నారు. పెట్టుబడులను పెద్ద యెత్తున ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగానే జైట్లీ బడ్జెట్ ఉండవచ్చునని భావిస్తున్నారు. మధ్యతరగతి, ఉద్యోగులను సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు.
రాజకీయంగా ఒత్తిడి లేకపోవడంతో కచ్చితమైన నిర్ణయాలను ప్రకటించవచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైన ఆర్థిక సాయం అందిస్తారనేది ఉత్కంఠను కలిగించే విషయం. బడ్జెట్‌లో పన్ను రాయితీలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications