జైట్లీ Vs కేజ్రీ: 'తీవ్రమైన ఆరోపణలు, తప్పించాల్సిందే'

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్‌లో జైట్లీని ఉద్దేశించి వరుస ట్వీట్లను పోస్టు చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకల కేసులో విచారణకు జైట్లీ ఎందుకు భయపడుతున్నారని అందులో ప్రశ్నించారు.

జైట్లీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవికి ఆయన తక్షణమే రాజీనామా చేయాలి లేదా స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేసేందుకు వీలుగా ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Arun Jaitley must be sacked: Arvind Kejriwal

'తనపై వచ్చిన ఆరోపణలను మీడియాలో జైట్లీ తోసిపుచ్చారు. విచారణ నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారు. మీడియాలో తోసిపుచ్చడం సరిపోతుందనుకున్నప్పుడు 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ నిందితులకు కూడా ఇదే వర్తిస్తుందని భావించాల'ని కేజ్రీవాల్ టిట్టర్‌లో పేర్కొన్నారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీడీసీఏలో నిధుల అవకతవకలు చాలా సీరియస్ కేసు, వాస్తవాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+