అరుణాచలంలో భక్తులకు కొత్త ఆంక్షలు - తాజా మార్గదర్శకాలు, ఈ రోజుల్లో నో ఎంట్రీ..!!

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం భక్తులకు బిగ్ అలర్ట్. ఆలయ అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. ఇక నుంచి తాజా మార్గదర్శకాలు తప్పని సరి చేసారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిరంతరం పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం కు తరలి వెళ్తున్నారు. ఇందు కోసం రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందిస్తోంది. కాగా.. అరుణాచలం కు పెరుగుతున్న భక్తుల రద్దీ వేళ... తాజాగా వస్తున్న ఫీడ్ బ్యాక్.. గుర్తిస్తున్న సమస్యలతో తాజా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం) ఆలయంలో భక్తుల రక్షణ, రద్దీ నియంత్రణ కోసం ఆలయ- స్థానిక అధికారులు పలు కొత్త ఆంక్షలు మరియు నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. గర్భగుడి ప్రాంతం చాలా ఇరుకుగా ఉండటం వల్ల భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆలయ బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల మేరకు ఇక నుంచి గర్భగుడి అభిషేకంలో పాల్గొనాలనుకునే భక్తులకు అభిషేకం ప్రారంభానికి ఒక గంట ముందుగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిని తప్పని సరి చేసారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నిర్ధారణ అయితేనే లోపలికి అనుమతిస్తారు. కాగా.. రద్దీ ఎక్కువగా ఉండే శని మరియు ఆదివారాల్లో గర్భగుడి అభిషేకానికి భక్తులకు అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. కాగా.. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు.

దసరా వేళ TGSRTC బంపరాఫర్, ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్ - వీరికి వర్తింపు..!!
దసరా వేళ TGSRTC బంపరాఫర్, ఇంటి వద్దే ప్రయాణీకుల పికప్ - వీరికి వర్తింపు..!!
arunachaleswarar-temple-introduces-new-restrictions-for-devotees-during-abhishekam-here-the-details

భక్తుల కోసం తాజా నిర్ణయాలు

ఆలయ గర్భ గుడి ప్రాంగణం చిన్నది కావటంతో.. ఎక్కువ సంఖ్యలో భక్తుల ఉన్న సమయంలో శ్వాస సంబంధిత, ఇతర సమస్యలకు గురి అవుతున్నట్లు గుర్తించారు. దీంతో.. ముందస్తుగానే భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక.. కొద్ది నెలల క్రితం ఊబకాయం ఉన్నవారు, వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు, ఆయాసం లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న భక్తులను రాతి చీలిక గుండా వెళ్లేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఇనుప కడ్డీలతో తనిఖీ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కడ్డీల మధ్య నుంచి సులభంగా వెళ్లగలిగే భక్తులను మాత్రమే రాతి చీలికలోకి అనుమతిస్తున్నారు. దీని ద్వారా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నవారిని ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు ఆలయ యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+