ఫలితాల రోజు టీవీ చూడని మోడీ: కేజ్రీవాల్ ఓ చిన్న నేత, గోద్రాపై మౌనం

ఢిల్లీ: లోకసభ ఎన్నికల ఫలితాల రోజు తాను టీవీ చూడలేదని, ఒక్కడినే ప్రశాంతంగా ఉన్నానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2014 మే 16వ తేదీన లోకసభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రోజు ఫలితాల కోసం యావత్ భారత దేశం ఉత్కంఠగా ఎదురు చూసింది. ఫలితాల రోజు అందరు టీవీ ముందు కూర్చున్నారు. మోడీ మాత్రం టీవీ చూడలేదు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాతే టెలిఫోన్ కాల్స్‌ను స్వీకరించారు.

ఆ తొలి ఫోన్ కాల్ నాటి బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిచిందని ఆయన తెలిపారు. దీనిని ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మాజీ మీడియా సలహాదారు లాన్స్ ప్రైస్ రచించిన 'ది మోడీ ఎఫెక్ట్: ఇన్ సైడ్ నరేంద్ర మోడీస్ క్యాంపెయిన్ టు ట్రాన్స్‌ఫామ్ ఇండియా' పుస్తకంలో మోడీ గురించి, ఆయన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలున్నాయి.

Arvind Kejriwal a 'small single city leader': Narendra Modi to a British journalist

ఈ పుస్తకాన్ని భారత్‌లో హాచెట్ సంస్థ ప్రచురించింది. ప్రధానితో పాటు పీయూష్ గోయల్ తదితర ఆయన కేబినెట్ సహచరులు, సలహాదారులు, విశ్లేషకుల బృందంతో ఇంటర్వ్యూలతో దీనిని రచించారు. ఈ పుస్తకం ప్రకారం... 2012 గుజరాత్ ఎన్నికల్లో తన గెలుపు నాటి నుండే పార్టీ ప్రధాని అభ్యర్థుల్లో తనను ఒకరిగా పరిగణిస్తారన్న విషయమై తనకు స్పష్టత ఉందని మోడీ పేర్కొన్నారు.

కానీ తాను ఎప్పుడు వాస్తవంగా దాని గురించి ఆలోచించలేదని, తనను ప్రధాని అభ్యర్థఇగా నామినేట్ చేసేలా పార్టీలో లాబీయింగ్ చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అసలు తనను లేదా మరొకరిని నామినేట్ చేస్తారా అన్న అంశంపై తనకు ఆసక్తి లేదన్నారు. ఎన్నికలకు ముందు మీడియాకు అందుబాటులో ఉండరాదనుకున్నానని, మీడియా ఆసక్తిని పొందాలనుకున్నానని చెప్పారు.

కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రయివేట్ విమానాన్ని తాము వినియోగిస్తున్నామని మీడియా రాసిందని, కానీ దానికి పార్టీ డబ్బులు చెల్లించిందని, మరో విషయమేమంటే ప్రచారాన్ని నడిపించేందుకు అవసరమైతే తాను సైకిళ్లు కూడా అద్దెకు తీసుకుంటానని చెప్పారు. వారణాసిలో కేజ్రీవాల్ తన పైన పోటీ చేసినప్పుడు తానసలు పట్టించుకోలేదని, ఆయన చిన్న నేత అన్నారు. ఆయన చిన్న నగర లీడర్ అన్నారు.

చాలామంది ప్రతిపక్ష నాయకులతో పోలీస్తే కావాలనే కొందరు ఆయనకు విపరీతమైన ప్రచారం కల్పించారన్నారు. కేజ్రీవాల్ గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోవాలని తాను అనుకోలేదని చెప్పారు. తాను ప్రధాని అనే భావన నేటికీ తనకు కలగలేదని జూలైలో చెప్పారు. పలు అంశాల గురించి ప్రస్తావించిన ప్రధాని మోడీ... గోద్రా అల్లర్ల పైన మాట్లాడేందుకు మాత్రం నిరాకరించారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+