ఓవైపు మోడీ ప్రసంగం.. మరో వైపు జైట్లీ, కేజ్రీ కునుకు..
న్యూఢిల్లీ : అసెంబ్లీలోను.. ముఖ్యమైన సభల్లోను.. నేతలు కునుకు తీయడం ఇదివరకు చాలాసార్లే చూసుంటాం. కొత్తగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోను కొంతమంది నేతలు కునుకు తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


ఓవైపు ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని.. దేశ ప్రజలంతా ఆసక్తిగా తిలకిస్తుంటే మరోవైపు సదరు నేతలు కునుకుతీయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ కునుకు తీసిన నేతలెవరంటే.. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, మరో సీనియర్ మంత్రి అనంత్ కుమార్ తమ సీట్లలో కునుకు తీయడం మీడియా కెమెరాల్లో రికార్డయ్యింది.ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మిగతా కేంద్రమంత్రుల లాగే తను కూర్చున్న సీట్లో ఓ కునుకేశారు.












Click it and Unblock the Notifications