కేజ్రీవాల్‌కు ప్రధాని మోడీ సలహా, ఎవరీ డాక్టర్ నాగేంద్ర...?
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది.
మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ నాగేంద్ర ఆయనకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. దాంతో మోడీ సలహాను అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ త్వరలో యోగా గురుని సంప్రదించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కేజ్రీవాల్ ఇంకా అపాయింట్‌మెంట్ తీసుకోలేదు: డాక్టర్ నాగేంద్ర

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విపరీతమైన దగ్గు, షుగర్ పీడిస్తున్నాయని యోగా గురు డాక్టర్ నాగేంద్ర చెబుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు, జీవన విధానంలో వచ్చిన మార్పులు, స్పెషలైజ్డ్ యోగా దోహదపడతాయని ఆయన అన్నారు.
ప్రధాని మోడీ ఏం చెప్పారు?
ఇటీవల ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఓ కార్యాక్రమానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను గమనించిన ప్రధాని మోడీ బెంగుళూరులో ఉన్న యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది.
ఎవరీ డాక్టర్ నాగేంద్ర?
కర్ణాటకకు చెందిన డాక్టర్ నాగేంద్ర వయసు 72 సంవత్సరాలు. బెంగుళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ డీమ్డ్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు.
మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ చేసి, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా సేవలందించిన ఆయన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీకి కన్సల్టెంట్ గా కూడా పనిచేశారు.
యోగా మీద నాగేంద్ర 35 పుస్తకాలను రాశారు. ప్రఖ్యాత యోగా గురు బికెఎస్ అయ్యంగార్ నుండి ''యోగ శ్రీ'' బిరుదును కూడా అందుకున్నారు. స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఆస్తమా రోగులకు చికిత్స అందించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications