Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో రాత్రి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ..జైలు అధికారులకు అందని రిలీజ్ ఆర్డర్స్ ; ఆర్యన్ బెయిల్ కు 14 షరతులు!!

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి గత ఇరవై ఐదు రోజులుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ఎదుర్కొంటున్న, జైలు జీవితాన్ని అనుభవిస్తున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఆర్థర్ రోడ్ జైల్లో అక్టోబర్ 7 వ తేదీ నుండి అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్న ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు తీసుకురావటానికి ఉదయం నుండి శతవిధాలా పని చేసినా ఫలితం లేకపోయింది. మరో రాత్రి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉండాల్సి ఉంది.

జైలుకు చేరని రిలీజ్ ఆర్డర్స్ .. మరో రాత్రి ఆర్యన్ ఖాన్ జైల్లోనే

జైలుకు చేరని రిలీజ్ ఆర్డర్స్ .. మరో రాత్రి ఆర్యన్ ఖాన్ జైల్లోనే

ఆర్యన్ ఖాన్ విడుదల పత్రాలు సకాలంలో జైలు అధికారులకు చేరకపోవడంతో శుక్రవారం ఆర్థర్ రోడ్ జైలులో మరో రాత్రి గడపనున్నట్లు జైలు అధికారులు వెల్లడించారు . జైల్లో ఈ రోజు రాత్రి కూడా అందరు ఖైదీలలాగే ఆర్యన్ ఖాన్ ను చూస్తామని, ఎలాంటి ప్రత్యేక వసతులు అందించబడదని జైలు అధికారులు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నార్కోటిక్స్ ప్రత్యేక కోర్టు పరిశీలించి, ప్రాసెస్ చేసిన తరువాత, ట్రయల్ కోర్ట్ విడుదల ఉత్తర్వు సాయంత్రం 5:30 గంటలలోపు జైలర్‌కు అందితే మాత్రమే ఈరోజు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ విడుదల ఉత్తర్వులు నిర్దేశిత సమయంలో జైలరుకు అందకపోవడం వల్ల శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ ఖాన్ జైలులోనే గడపాల్సి వస్తుంది.

శనివారం ఆర్యన్ ఖాన్ విడుదలకు ఛాన్స్

శనివారం ఆర్యన్ ఖాన్ విడుదలకు ఛాన్స్

ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసినప్పటికీ ఈరోజు కూడా ఆర్యన్ ఖాన్ ను బయటకు తీసుకురాలేకపోయారు న్యాయవాదులు. ఈరోజు ఎలాగైనా కొడుకును బయటకు తీసుకురావాలని తండ్రి షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్ తరపున వాదించిన లాయర్ల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొడుకు ఆర్యన్ ఖాన్ రాక కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్న తల్లికి మళ్ళీ ఆవేదన తప్పలేదు. శనివారం నాడు ఆర్యన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చెయ్యటంతో బాలీవుడ్ హర్షం

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చెయ్యటంతో బాలీవుడ్ హర్షం


ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అంతకు ముందు రెండు సార్లు ఆర్యన్ ఖాన్ కు ఎన్డిపిఎస్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని నిరాకరించడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాదులు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాల వాదనను, ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు ఫైనల్ గా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. షారుఖ్ ఖాన్ కుమారుడు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయడంతో బాలీవుడ్లో షారుక్ ఖాన్ కు మద్దతుగా నిలిచిన పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

 ఆర్యన్ ఖాన్ బెయిల్ కు 14 షరతులు

ఆర్యన్ ఖాన్ బెయిల్ కు 14 షరతులు


అయితే షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు 14 షరతులను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పద్నాలుగు షరతులలో ఏ ఒక్క షరతు నైనా ఆర్యన్ ఖాన్ ఉల్లంఘిస్తే మళ్లీ బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇక కోర్టు విధించిన షరతులను చూస్తే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆర్యన్ ఖాన్ ముంబైని విడిచి పెట్టి వెళ్ళడానికి వీలు లేదు. ఆర్యన్ ఖాన్ పాస్ పోర్టును అప్పగించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించారు. ఎలాంటి కార్యక్రమాలలోనూ ఆర్యన్ ఖాన్ పాల్గొనకూడదు. డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చంట్,మున్మున్ ధమేచాలతో పాటు ఇతర నిందితులు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీడియాతో డ్రగ్స్ కేసు గురించి మాట్లాడకూడదు.

ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు విచారణకు హాజరు కావాలని షరతు

ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు విచారణకు హాజరు కావాలని షరతు

ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి రెండు గంటల మధ్య నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి వెళ్లాలి. కోర్టులో కేసు కు సంబంధించిన విచారణకు హాజరు కావాలి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ అవసరమని భావించిన ప్రతి సందర్భంలోనూ విచారణకు సహకరించాలి. కోర్టు ఆదేశాల ప్రకారం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు బాండ్‌ను సమర్పించాలి. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం విధించిన ఈ షరతు లలో దేనినైనా ఉల్లంఘిస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెయిల్ను రద్దు చేయమని అభ్యర్థించవచ్చు అని కోర్టు పేర్కొంది.

Recommended Video

    డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!
    ఆర్యన్ ఖాన్ కోసం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చిన జూహీ చావ్లా

    ఆర్యన్ ఖాన్ కోసం లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చిన జూహీ చావ్లా

    కోర్టు విధించిన షరతులలో భాగంగా లక్ష రూపాయల పూచీకత్తు బాండ్లను సమర్పించాల్సిన క్రమంలో ఈ మేరకు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తును షారుక్ ఖాన్ తో పాటు సినిమాలలో నటించిన, షారుక్ ఖాన్ కుటుంబానికి సన్నిహితురాలుగా చెప్పుకునే జుహీ చావ్లా ఆర్యన్ ఖాన్ కోసం కోర్టుకు సమర్పించారు. అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడుల తర్వాత ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ మూడు వారాలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ఇంత కాలం తర్వాత జైలు నుండి విడుదల కాబోతున్నారు. ఆర్యన్ ఖాన్ ను బెయిల్ కోసం షారూక్ ఖాన్ పెద్ద పోరాటమే చెయ్యాల్సి వచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+