అరుదైన సంఘటన: డ్రైవర్ కోసం కారును డ్రైవ్ చేసిన కలెక్టర్

అకోరా: తన వద్ద డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తికి ఓ కలెక్టర్ అతను ఎన్నడూ మరిచిపోలేని విధంగా ఫేర్‌వెల్ ఇచ్చారు. సదరు డ్రైవర్ రిటైర్మెంట్ డే రోజున ఆ కలెక్టర్ స్వయంగా తాను కారును డ్రైవ్ చేశాడు. డ్రైవర్‌ను వెనుక సీట్లో కూర్చుండబెట్టాడు.

ఈ అరుదైన సంఘటన మహారాష్ట్రంలోని అకోలా జిల్లాలో జరిగింది. తన మొత్తం సర్వీసులో 18 మంది కలెక్టర్లు, సీనియర్ అధికారుల వద్ద డ్రైవర్‌గా పని చేసిన దిగంబర్ థాక్ పదవీ విరమణ చేశాడు.

As Farewell Gift, Collector Drives Chauffeur To Work On Retirement Day

అతనికి డ్రైవర్ పదవీ విరమణ జీవితాంతం గుర్తుండిపోయాలా చేయాలని భావించిన కలెక్టర్ శ్రీకాంత్ ఏకంగా డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారారు. దిగంబర్‌ను కారులో ఎక్కించుకుని కలెక్టరేట్ వరకు స్వయంగా కారు నడిపారు.

అంతేకాదు కార్యాలయం ముందు కారు ఆపి తాను ముందు దిగి డోర్ తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన 35 ఏళ్ల సర్వీసులో దిగంబర్ ఎంతోమంది అధికారులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారని కలెక్టర్ పేర్కొన్నారు. అతడి పదవీ విరమణ రోజు జీవితాంతం గుర్తుండాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+