ఇస్రో ఛైర్మన్‌గా ఆలూరి కిరణ్ కుమార్
న్యూఢిల్లీ: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఇస్రోకి నూతన ఛైర్మన్‌గా ఆలూరి కిరణ్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అహ్మాదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1975 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. చంద్రయాన్-1, మంగళ్ యాన్ తదితర ఉపగ్రహ ప్రయోగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్ కుమార్ మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ పదవిలో ఉంటారు.
ఇస్రో ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ డిసెంబర్ 31న బాధ్యతల నుంచి వైదొలగగా, ఆయన స్ధానంలో శైలేష్ నాయక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications