జియో ఫోన్ తో టెల్కోల్లో గుబులు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే: జాఫరీస్ వెల్లడి
రిలయన్స్ జియో నూతనంగా ఆవిష్కరించిన 4జీ ‘జియోఫోన్’తో.. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు పెను సవాలు ఎదురు కానున్నదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జాఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నూతనంగా ఆవిష్కరించిన 4జీ 'జియోఫోన్'తో.. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు పెను సవాలు ఎదురు కానున్నదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జాఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లో అడుగుపెట్టిన జియో 10 కోట్ల మంది వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరం తిరిగేసరికి మరో సంచలన 4జీ ఫీచర్ ఫోన్‌తో ముందుకొచ్చింది.

50 కోట్ల మంది లక్ష్యం...
ఈసారి ఏకంగా 50 కోట్ల మంది వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇతర టెల్కోలు తమ వినియోగదారులను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుందని జాఫరీస్ పేర్కొంది.

వాటి ఏఆర్‌పీయూ కన్నా...
‘‘జియో నెలవారీ ప్లాన్ మూడు ప్రధాన టెల్కోల ఏఆర్‌పీయూ (యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్)కు భిన్నంగా ఉంది. అయితే ధర విషయంలో కొంతమేరకు మిగతా వాటి మాదిరిగానే ఉన్నప్పటికీ... మార్కెట్ వాటాలోని తమ వినియోగదారులను కాపాడుకోవడం మాత్రం కష్టమే..'' అని పేర్కొంది.

ఎంతోకాలంగా ఎదురుచూపులు...
జియో ప్రియులు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న 4జీ ఫోన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని సెప్టెంబర్ నాటికల్లా అందుబాటులోకి తేవాలని రిలయన్స్ సంస్థ భావిస్తోంది.

డిపాజిట్ తిరిగి రావడంతో, ఫ్రీ...
ధర రూ.1500 కావడం.. అందునా ఫోన్ కోసం పెట్టిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉండడంతో దీనిపై జనాల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. వారానికి 50 లక్షల ఫోన్లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

డేటాతోపాటు వాయిస్ మెసేజ్ లు కూడా...
నెలకు రూ.153తో రోజుకు 500 ఎంబీ డేటాతో పాటు వాయిస్, ఎస్‌ఎమ్ఎస్‌లు ఉచితంగా అందుకోవచ్చు. ఇక రెండు, ఏడు రోజుల తాత్కాలిక ప్రయోజనం కోసం రూ.24, రూ.54 ప్లాన్లను కూడా జియో తీసుకొస్తోంది.

2జీ, 3జీ ఫోన్లకు పెద్ద పోటీ...
మిగతా కంపెనీల టారిఫ్‌లు కూడా నెలకు రూ.142 నుంచి 158 వరకు ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో 2జీ, 3జీ ఫోన్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు జియో 4జీ ఫోన్ సిద్ధమవుతుండడంతో ప్రధాన టెల్కోలు భారీ సవాలు ఎదుర్కోనున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications