Petrol, Diesel: పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ..

ఉన్నట్టుండి పెట్రోల్ బంక్ ల్లో రద్దీ భారీగా పెరిగింది. పెట్రోల్ బంక్ ల్లో రద్దీ పెరడం ఏంటని అనుకుంటున్నారా.. అవును రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తుండడంతో చాలా మంది వాహనదారులు పెట్రోల్ బంక్ ల్లో బారులు తీరారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంక్ ల్లో భారీగా రద్దీ కనిపిస్తోంది. దీంతో పెట్రోల్ బంక్ ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ప్రతి పెట్రోల్ బంకు దగ్గర వందలాది వాహనాలు.. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ అయిపోయింది. నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.

As the owners of oil tankers went on strike, there was a huge rush in the petrol stations

ముంబై, థానే, నాగపూర్, పూణె, నాసిక్ తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఆయిల్ డిపోల నుంచి 900 నుంచి 12 వందల ట్యాంకర్లు.. పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేసేవి. ప్రస్తుతం వీటిలో కేవలం 250 ట్యాంకర్లు మాత్రమే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. దీంతో బంకుల్లో పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో లారీ యజమానుల సంఘాలతో చర్చలు ప్రారంభించింది.

అత్యవసరం కింద ఆయిల్ ట్యాంకర్లను మినహాయించాలని కోరుతుంది. దీనిపై యజమానులు వెనక్కి తగ్గటం లేదు. హిట్ అండ్ రన్ కేసు విషయానికి వస్తే.. చట్టంలో మార్పుల తర్వాత.. ఎవరినైనా వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతే.. ఆ కేసులో 10 లక్షల జరిమానా, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా చట్టం తీసుకొచ్చారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగితే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+